ETV Bharat / politics

'శ్రీకాకుళం రా కదలి రా' - చంద్రబాబు సభ విజయవంతానికి తమ్ముళ్ల సన్నాహాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 7:11 PM IST

Etv Bharat
Etv Bharat

TDP Ra Kadali Ra Sabha : శ్రీకాకుళంలో ఈ నెల 26న నిర్వహించే తెలుగుదేశం రా కదలి రా సభను శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రా కదలి రా సభ ఇదే చివరిదని వెల్లడించారు.

TDP Ra Kadali Ra Sabha : శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. తెలుగు దేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూన రవికుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు రా కదలిరా బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టీడీపీ - జనసేన పార్టీలు మేనిఫెస్టో ప్రకటించే ముందు సభ అని, రా కదలిరా చివరి సభ అని చెప్పారు.

జగన్​కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు

చంద్రబాబు నాయుడు (Chandrababu) మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. నంద్యాలలో ఆగిపోయిన యాత్ర మళ్లీ ప్రారంభించుకున్న నేపథ్యంలో ఇక్కడ జరగనున్న రా కదలి రా సభ చివరిది కానుంది. ఈ సభకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల 28న టీడీపీ-జనసేన సభ నిర్వహించి మ్యానిఫెస్టో ప్రకటించడానికి ఒకరోజుగా ముందు జరిగే రా కదలి రా సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి.

ఉద్యోగాల భర్తీపై జగన్ ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు - నాది విజన్‌, జగన్‌ది పాయిజన్‌: చంద్రబాబు

రాష్ట్రంలో ఇసుక దందాపై జాతీయ హరిత ట్రిబ్యునల్​ (NGT) చెప్పినా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ మండిపడ్డారు. శ్రీకాకుళం తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేతలు లక్షా పది వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారన్నారు. గవర్నర్(Governor) ఎన్జీటీ నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.

కాతేరు కదిలింది! - 'రా కదలి రా' కార్యక్రమానికి భారీ జనప్రవాహం

వలంటీర్లు రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని మంత్రి ధర్మాన(Minister Dharmana) ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. శ్రీకాకుళం తెదేపా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా నేత కూన రవికుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఏ వలంటీర్ అయినా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. ఎంతోమంది వలంటీర్లుపై కేసులు ఉన్నాయని గుర్తు చేసిన టీడీపీ నేతలు వలంటీర్లు నిష్పక్షపాతంగా పనిచేసే రానున్న ప్రభుత్వంలో కొనసాగుతారన్నారు.

కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం - జగన్​కు కౌంట్​డౌన్​ మొదలైంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.