ETV Bharat / politics

నేటితో ముగియనున్న టీడీపీ రా కదలిరా సభలు - భారీగా రానున్న టీడీపీ శ్రేణులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 10:51 AM IST

Telugu Desam Party Raa Kadali Raa Final Meeting: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న 'రా కదలిరా' ముగింపు సభను సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 23 చోట్ల ఈ సభలు జరిగాయి. చివరి సభను పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.

raa_kadali_raa
raa_kadali_raa

నేటితో ముగియనున్న టీడీపీ రా కదలి రా సభలు - భారీగా రానున్న టీడీపీ శ్రేణులు

Telugu Desam Party Raa Kadalira Final Meeting: నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎర్రమంచిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలిరా ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న 24వ రా కదలిరా ను కార్యక్రమం ముగింపు సభగా పార్టీ ప్రకటించింది. తొలుత ఈ సభను రాప్తాడులో నిర్వహించాలని భావించగా, హిందూపురం పార్లమెంటుకు రాప్తాడు చివరగా ఉంటుందని, పెనుకొండ అయిచే నియోజకవర్గానికి మధ్యలో ఉంటుందని సభ వేదికను మార్చారు. ఇది ముగింపు సభ కావటంతో పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు పార్థసారథిల ఆధ్వర్యంలో రా కదలిరా సభను నిర్వహిస్తున్నారు.

తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు - మాలో విభేదాలు సృష్టించలేరు : చంద్రబాబు

టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమ, దీని అనుబంధ పరిశ్రమలకు మధ్యన సవితకు చెందిన సొంత భూమిలో సభా వేదికను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు సభకు హాజరయ్యే ప్రజలకు కియా ప్రధాన పరిశ్రమతో పాటు, అనుబంధ పరిశ్రమలు కనపడేలా సభావేదికను నిర్మించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శలు చేస్తున్న సీఎం జగన్​తో పాటు ఆయన మంత్రులకు కూడా టీడీపీ అధినేత ఈ సభావేదిక పైనుంచే కియా పరిశ్రమను చూపుతూ సమాధానం చెప్పనున్నారు. ఏర్పాట్లు పూర్తైనట్లు టీడీపీ నేతలు తెలిపారు.

నెల్లూరు, పల్నాడు పసుపుమయం- నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వైసీపీ నేతలు

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలు దేరి ఎర్రమంచికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు సభావేదిక వద్దకు రానున్నారు. కియా పరిశ్రమకు ఎదురుగా, కియా అనుబంధ పరిశ్రమలకు మధ్యన ఏర్పాటు చేసిన సభా వేదికపైనుంచే వైకాపా ప్రభుత్వ అరాచకాలపై ప్రజలను చైతన్యవంతం చేయనున్నారు. ఒక్క చాన్సు ఇచ్చినందునే అన్ని వర్గాల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలియచెప్పనున్నారు. అభివృద్ధి ఊసే లేకుండా ఐదేళ్లు యువత కు ఉద్యోగ, ఉపాధి లేకుండా చేసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు యువతను ఉద్దేశించి గుర్తుచేయనున్నారు.

గురజాలలో చంద్రబాబు 'రా కదలి రా' సభ- భారీ ఏర్పాట్లు చేస్తోన్న టీడీపీ శ్రేణులు

కియా పరిశ్రమ, దాని అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. ముఖ్యంగా ఈ పరిశ్రమ వచ్చాక చుట్టుపక్కల గ్రామాల్లో యువతకు ఉద్యోగంతో పాటు స్థానికులకు ఉపాధి దొరికిన వైనం ప్రత్యక్షంగా చూపనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో కరవు ప్రాంతంలో భూముల ధరలు పెరిగి గ్రామీణుల ఆర్థికాభివృద్ధి జరిగిన పరిస్థితులను చంద్రబాబు ఎర్రమంచి సభలో చూపనున్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడు పెనుకొండ రా కదలిరా సభ ద్వారా మరోసారి ప్రజలకు భవిష్యత్ ప్రణాళికను వివరించనున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు సభకు హిందూపురం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున ప్రజలు రానున్నారు. శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.