ETV Bharat / politics

టీడీపీ అధికారంలోకి వస్తే గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించేస్తాం: నారా లోకేశ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 12:09 PM IST

Updated : Mar 20, 2024, 12:25 PM IST

Nara_Lokesh_Meet_Apartment_Dwellers
Nara_Lokesh_Meet_Apartment_Dwellers

Nara Lokesh Meet Apartment Dwellers: సీఎం జగన్ విధ్వంస పాలనకు ఇవే ఆఖరి రోజులని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించేస్తామని హామీ ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వస్తే గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించేస్తాం: నారా లోకేశ్

Nara Lokesh Meet Apartment Dwellers: ఏ సీఎం అయినా తమ పరిపాలనను ఏదైనా శుభకార్యం లేక అభివృద్ధి కార్యక్రమంతోనో ప్రారంభిస్తారని, అయితే సీఎం జగన్ మాత్రం విధ్వంసంతో తన పాలనను ఆరంభించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజా వేదికతో మొదలైన ముఖ్యమంత్రి విధ్వంస పాలనతో ప్రజలు ఐదేళ్లు నరకం అనుభవించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అపర్ణ అపార్ట్‌మెంటు వాసులతో నారా లోకేశ్ భేటీ అయ్యారు.

ఈ క్రమంలో మాట్లాడిన ఆయన హిందూపురం, కుప్పం నియోజకవర్గాలతో పోటీపడేలా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గంజాయిని రాష్ట్రమంతా విస్తరించిన ఎమ్మెల్సీ అనంత బాబును ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టుకున్నాడు అంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను పరిపాలనలోనూ, అభివృద్ధిలోనూ భాగస్వాములు చేస్తామన్నారు.

పేదరికం లేకుండా చేయడమే ధ్యేయం - రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి: లోకేశ్​

Lokesh on TDP Activist Munaiah Death Case: జగన్ గొడ్డలి పార్టీకి రక్తదాహం మరింత పెరిగిపోయిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్త మునయ్యను వైసీపీ సైకోలు చంపేశారని మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు. ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో మునయ్యను నరికి(YSRCP Leaders Attacked on TDP Activist) చంపేశారని ఆరోపించారు. మునయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్న ఆయన దోషులను చట్టం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. ఈ క్రమంలో జగన్‌, ఆయన సైకో సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులని అన్నారు.

లోకేశ్ కాన్వాయ్‌ని ఆపిన పోలీసులు: కాగా అంతకుముందు ఎన్నికల విధుల్లో భాగంగా లోకేశ్ కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీలు చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేశ్ కాన్వాయ్‌ని ఆపిన పోలీసులు(Police Stopped Nara Lokesh Convoy) వాహనాలన్నింటినీ చెక్​ చేశారు. తాడేపల్లిలోని అపార్ట్‌మెంటు వాసులతో ముఖాముఖి చేసేందుకు లోకేశ్ వెళ్తుండగా పోలీసు అధికారులు వాహనాలను ఆపారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని, కోడ్‌(Election Code) నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేశ్‌ ప్రచారం సాగుతోందని పోలీసులు నిర్ధారించుకున్నారు.

రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఈసీ దృష్టి సారించాలి: చంద్రబాబు

Last Updated :Mar 20, 2024, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.