ETV Bharat / politics

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Condemn Attack on tdp

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 12:27 PM IST

Updated : Apr 11, 2024, 1:43 PM IST

Chandrababu_Condemn_Attack_on_TDP_Leader
Chandrababu_Condemn_Attack_on_TDP_Leader

TDP Chief Chandrababu Condemn Attack on Party Leader: ఒంగోలులో టీడీపీ నేతపై దాడి ఘటనను చంద్రబాబు ఖండించారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందన్న ఆయన, ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

TDP Chief Chandrababu Condemn Attack on Party Leader: ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించిందన్నారు.

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు

ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ దౌర్జన్యాలను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోందన్నారు.

జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే- జాబితా ప్రకటించిన పవన్ - Janasena Party Star Campaigners

దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ అరాచకాలపై, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని కోరారు. మోహన్‌రావుపై దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌ కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

"ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోంది. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఒంగోలులో వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించింది. ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేశారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారు. ఈ దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోంది." - చంద్రబాబు, టీడీపీ అధినేత

బాలినేనికి అలవాటే: ఎన్నికల్లో సానుభూతి కోసమే బాలినేని శ్రీనివాసరెడ్డి నాటకాలాడుతున్నారని టీడీపీ నేత దామచర్ల జనార్దన్‌ అన్నారు. గత ఎన్నికలకు ముందు కమ్మపాలెంలో ఉద్రిక్తతలు సృష్టించారని, ఈసారి ఒంగోలు సమతానగర్‌లో గొడవలు సృష్టించారని ఆయన తెలిపారు. బాలినేని కోడలు ప్రచారానికి వెళ్లి కరపత్రాలు ఇచ్చారన్నారు. కుల రాజకీయాలు చేసి కేసులతో ఇబ్బంది పెట్టడం బాలినేనికి అలవాటేనని దామచర్ల స్పష్టం చేశారు. చికిత్స కోసం బాధితులను చేర్పిస్తే దౌర్జన్యం చేయిస్తున్నారని దామచర్ల జనార్దన్‌ ఆరోపించారు.

ఒకే వేదికపై మెరిసిన మూడు పార్టీల అధ్యక్షులు - వైసీపీ వైఫల్యాలపై ఎండగట్టిన నేతలు - TDP Janasena BJP Public Meeting

Last Updated :Apr 11, 2024, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.