ETV Bharat / politics

రాష్ట్రంలో కూటమిదే అధికారం- మోదీ నామినేషన్​లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ - Modi nomination

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 3:31 PM IST

Babu, pawan meet Modi : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ ప్రధాని మోదీ నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్​డీఏ కూటమి 400పైగా స్థానాలు సాధిస్తుందని తెలిపారు.

pawan_cbn_meet_pm_modi
pawan_cbn_meet_pm_modi (Etv Bharat)

Babu, pawan meet Modi : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న ఆయన ప్రపంచంలోనే భారతదేశం కీలకపాత్ర పోషించబోతుందన్నారు. 2047కు వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో NDA క్లీన్ స్వీప్ చేస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌ ఘట్టంలో ఎన్డీయే నేతలు, చంద్రబాబుతో కలిసి జనసేనాని పాల్గొన్నారు. మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.