ETV Bharat / politics

అయోధ్యలో చంద్రబాబు - బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 9:13 AM IST

Chandrababu Naidu in Ayodhya: రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అయోధ్యకు చేరుకున్నారు. చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరుకానున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సైతం ఇప్పటికే అయోధ్యకు వెళ్లారు.

chandrababu_Naidu_in_Ayodhya
chandrababu_Naidu_in_Ayodhya

Chandrababu Naidu in Ayodhya: యావత్ దేశం ఎదురుచూస్తున్న అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు అంతా సిద్ధమైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు అయోధ్యకు బయల్దేరారు. నేడు అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబును ఆహ్వానించారు.

చంద్రబాబుతో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు అయోధ్యకు వెళ్లారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు అయోధ్యకు బయల్దేరారు. నేడు అయోధ్యలో జరగనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం అయోధ్య నుంచి తిరిగివస్తారు.

రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు ఆదివారం అయోధ్యకు చేరుకోగ, ఆయనకు ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.

అంతా రామమయం - రాష్ట్రంలో భారీ ఎత్తున శోభాయాత్రలు

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, శివమాల దంపతులకు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘనంగా స్వాగతం పలికారు. అయోధ్యకు వెళ్లడం కోసం ప్రముఖ నటుడు రజనీకాంత్‌ లఖ్‌నవూ ఎయిర్ పోర్టులో కనిపించారు. ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులు ఆదివారం నుంచే అయోధ్యకు చేరుకున్నారు. అదే విధంగా సినీనటి కంగనా రనౌత్‌ ఇప్పటికే అయోధ్యలో ఉన్నారు.

ఈ క్రతువులో భాగమవుతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అయోధ్యలో మీడియాతో వ్యాఖ్యానించారు. మనమంతా సంతోషపడే క్షణాలివి అని, ఎట్టకేలకు దేశం శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను ఎంతగానో ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఇప్పటికే దేశంలో వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులు సుమారు 8 వేల మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. అందులో 506 మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేశారు. మరోవైపు, సోమవారం కన్నులపండువగా జరిగే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. అందమైన పువ్వులు, ప్రత్యేక దీపాలతో అలకరించారు.

అయోధ్యకు తిరుపతి నుంచి లక్ష లడ్డూలు

Ayodhya Ram Mandir Pran Pratishtha: ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారం కానుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. కోట్ల మంది ప్రజల ప్రత్యక్ష, పరోక్ష వీక్షణ నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరిస్తున్నారు. అలానే దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు మొత్తం 7 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్యలో సంబరాలు మొదలయ్యాయి.

బాలరాముడి పీఠం కింద మహా యంత్రం- తయారు చేసింది చీరాల ఆయనే!- విగ్రహం ఎలా ప్రతిష్ఠిస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.