ETV Bharat / politics

గొప్పలు అదుర్స్‌, రాబడి రివర్స్‌ - జగన్ పాలనలో మరింత వెెనక్కి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 7:07 AM IST

revenue_income
revenue_income

Revenue Decreased in Jagan Government: నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుందని ఓ సినిమాలో బాగా పేలిన డైలాగ్‌. ఒక రాష్ట్ర రెవెన్యూ రాబడిని పొరుగునున్న వాటితో పోల్చితే ఆ పాలకుల సత్తా ఏంటో తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్లు జగన్‌ పాలనలోని ఐదేళ్లను తెలంగాణతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు ఇట్టే అవగతమవుతాయి. స్థూల ఉత్పత్తి పెరిగిందని జగన్ సర్కార్‌ డప్పుకొట్టుకుంటున్నా వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని రాబడిని చూస్తే అర్థమవుతుంది.

గొప్పలు అదుర్స్‌ రాబడి రివర్స్‌ - జగన్ పాలనలో మరింత వెెనక్కి

Revenue Decreased in Jagan Government: జగన్‌ పాలనలో అయ్యో ఆంధ్రప్రదేశ్‌ అనుకునే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. లెక్కకు మించిన అప్పులతో వాటిని తీర్చేందుకు మళ్లీ రుణాలు తేవాల్సిన దారుణ దుస్థితి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేని జగన్‌ విధానాలు ఏపీని రివర్స్‌ పంథాలో నడిపిస్తున్నాయి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అన్నది పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే తప్ప ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడదు. ప్రభుత్వం సరైన దృక్పథంతో ప్రజానుకూల, అభివృద్ధికర విధానాలను అనుసరిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే అభివృద్ధి పనులు చేసేందుకు వీలు అవుతుంది.

ఇసుకను ఊడ్చేస్తున్న వైసీపీ నేతలు- ఎన్జీటీ విచారణలో అధికారులకే చిక్కులు!

జగన్‌ విధానాల వల్లే ఆర్థికంగా వెనక్కి: 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలి అయిదేళ్లు ఆ తర్వాత జగన్‌ పాలనలోని ఐదేళ్లనూ పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చి చూస్తే రాష్ట్ర పరిస్థితి అర్థమవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం హయాంలో రాష్ట్ర ఆదాయం తెలంగాణతో పోలిస్తే ఎంతో ఎక్కువగా ఉండేది. విభజన కారణంగా రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా, రెవెన్యూ లోటు ఇబ్బందులు ఉన్నా తెలంగాణను మించి మరీ సొంత ఆదాయం పొందగలిగేది. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు పాటించిన విధానాల వల్ల తెలంగాణ కన్నా ఏపీలో వరుసగా 28.70, 16.43, 19.41, 18.28, 13.07 శాతం మేర రాబడి అధికంగా వచ్చింది. అలాంటిది జగన్‌ పాలనలో చివరికి వచ్చేసరికి రాష్ట్ర ఆదాయం పడిపోయింది.

ఏపీతో పోలిస్తే తెలంగాణ తన రాబడులను పెంచుకొని ముందడుగు వేసేసింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్‌ కన్నా తెలంగాణ ఒక శాతం అధికంగా ఆదాయం పెంచుకుంది. ఒకానొక దశలో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 28 శాతం రాబడులు సాధిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ కంటే తెలంగాణ 4 శాతం అధికంగా ఆదాయం పొందింది. జగన్‌ ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బరితెగించిన వైఎస్సార్​సీపీ - అడ్డదారిలో కొత్త రకమైన ప్రచారం

నిజానికి తెలంగాణకు హైదరాబాద్‌ గుండెకాయ. అక్కడ రిజిస్ట్రేషన్లు, భూముల క్రయ విక్రయాలు ఎంతో ఎక్కువ. అందువల్ల సహజంగానే ఆదాయం అధికంగా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉండేది. ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు 19వేల 316.84 కోట్ల ఆదాయం వస్తే తెలంగాణకు 18 వేల 648.45 కోట్లు మాత్రమే వచ్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో పరిస్థితులు దిగజారాయి. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో పెరిగిపోగా, ఏపీలో బాగా తగ్గింది. జగన్‌ ప్రభుత్వం భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ఐదుసార్లు పెంచేసినా ఇలాంటి దుస్థితి నెలకొంది.

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని ప్రభుత్వం, పార్టీ కార్యాలయాలకు మాత్రం!

జగన్‌ ప్రభుత్వంలో సీన్​ రివర్స్‌: జగన్‌ ఐదేళ్ల పాలనలో రిజిస్ట్రేషన్ల ద్వారా మొత్తం ఆదాయం 33వేల 604.52 కోట్లు కాగా తెలంగాణకు 49వేల169.90 కోట్ల ఆదాయం వచ్చింది. పెట్రోలు, డీజిల్, క్రూడ్‌ ఆయిల్‌ వంటి ఉత్పత్తుల వల్ల వచ్చే రాబడి అమ్మకపు పన్నులో కనిపిస్తుంది. డీజిల్, పెట్రోలుపై లీటరుకు రూపాయి చొప్పున సెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో అదనం. పెట్రోలు, డీజిల్‌ ధరలు కూడా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం. అయినా రాష్ట్రానికి వచ్చే రాబడి తగ్గిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని చివరి సంవత్సరంలో గమనిస్తే తెలంగాణ కన్నా ఏపీలోనే ఈ ఆదాయం ఎక్కువ. అయితే జగన్‌ ప్రభుత్వంలో పరిస్థితి రివర్స్‌ అయింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణతో పోలిస్తే ఏపీలో 31.65 శాతం మేర ఆదాయం తక్కువగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.