ETV Bharat / politics

అప్పుడు తిట్టి, ఇప్పుడెలా నియమిస్తారు - టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్​గా మహేందర్‌రెడ్డిని తొలగించండి : ఎమ్మెల్సీ కవిత

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 12:24 PM IST

MLC Kavitha Fires on CM Revanth Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన సింగరేణి ఉద్యోగాలను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​గా మహేందర్‌రెడ్డి నియామకాన్ని కవిత తప్పుబట్టారు.

kavitha
kavitha

MLC Kavitha Fires on CM Revanth Reddy : రాష్ట్ర గీతం గురించి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేవంత్‌ ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం తనలాగా ఉందని సీఎం అంటున్నారని, తానూ రాష్ట్ర ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం ఏంటి? అని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పాత టెండర్లను ఎందుకు రద్దు చేస్తున్నారు : కవిత

kavitha Fires on Congress Government : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన సింగరేణి ఉద్యోగాలను హైదరాబాద్‌లో సీఎం ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. కారుణ్య నియామక ఉద్యోగాలు ఇస్తూ, తామే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

kavitha Comments on Mahender Reddy : టీఎస్​పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని (TSPSC Chairman Mahender Reddy) నియమించడాన్ని కవిత తప్పుబట్టారు. గతంలో ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన రేవంత్‌, ఇప్పుడు ఛైర్మన్‌ పదవిలో కూర్చోబెట్టారని విమర్శించారు. మహేందర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పదవి నుంచి తొలగించాలని, అదేవిధంగా దీనిపై న్యాయ విచారణ జరపాలని కవిత డిమాండ్‌ చేశారు.

ఆయన రాహుల్‌ గాంధీ కాదు, ఎలక్షన్​ గాంధీ - ఆ విషయంలో అట్టర్​ ప్లాఫ్ : ఎమ్మెల్సీ కవిత

మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని కవిత అన్నారు. ఎప్పుడు కరెంట్‌ వస్తోందో, పోతుందో తెలియడం లేదని, హైదరాబాద్‌లో రోజుకూ 3 నుంచి 4 గంటల కోత విధిస్తున్నారని తెలిపారు. విద్యుత్ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్‌లుగా నియమించారని ఆరోపించారు. గతంలో సహాయదారులు ఉండకూడదని కాంగ్రెస్‌ కోర్టులో కేసులు వేసిందని, కానీ తెలంగాణ అసెంబ్లీకి ఏపీ సలహాదారుడు ఎందుకని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ పునరావాసం కోసమే కదా? అని కవిత వ్యాఖ్యానించారు.

"రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్‌ మాట్లాడటం హాస్యాస్పదం. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదు. తెలంగాణ తల్లి విగ్రహం నాలాగా ఉందని సీఎం అంటున్నారు. నేనూ తెలంగాణ ఆడబిడ్డనే కదా? తెలంగాణ తల్లి విగ్రహం గురించి సీఎం రేవంత్‌ మాట్లాడటం ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు." - కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డిని తొలగించాలి

అసలేం జరిగిదంటే : సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం హైదరాబాద్​ నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నియామకపత్రాలను అందజేశారు. కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కృషిచేసిన నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్‌నర్సుల పోస్టులను భర్తీచేశామని రేవంత్​రెడ్డి గుర్తుచేశారు.

ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభానికి ప్రియాంక గాంధీని ఓ హోదాలో పిలుస్తారు? : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది : కల్వకుంట్ల కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.