ETV Bharat / politics

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు గుర్తుకురాలేదా : పొన్నం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 4:55 PM IST

Updated : Jan 22, 2024, 7:13 PM IST

Minister Ponnam Counter To MLC Kavitha : పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలకు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనడంపై "ఎక్స్‌'' వేదికగా స్పందించారు.

Minister Ponnam Reaction in Twitter on Ayodhya Ram Mandir
Minister Ponnam Counter To MLC Kavitha

Minister Ponnam Counter To MLC Kavitha : అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనడంపై "ఎక్స్‌'' ద్వారా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్ (BRS) నేతలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి కొనియాడారు. ఆ మహనీయుడి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనమని పేర్కొన్నారు.

  • @RaoKavitha గారు

    అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే

    ఆ మహనీయుడి విగ్రహం అసెంబ్లీ లో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరం

    పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని...మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల… pic.twitter.com/KX69wMRdhy

    — Ponnam Prabhakar (@PonnamLoksabha) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ponnam on Mahatma Jyotirao Phule Statue in Assembly : అణచివేతకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటమే తమ ప్రభుత్వానికి ఆదర్శం అన్నారు. అందుకే ప్రజాభవన్​కు పూలే పేరును పెట్టుకున్నాం, ప్రజా పాలన అందిస్తున్నామని వివరించారు. పూలే తమకు సర్వదా స్మరణీయుడని మంత్రి (Ponnam Prabhakar) పేర్కొన్నారు. బీసీలను వంచించిన బీఆర్‌ఎస్‌ నాయకులారా, బీసీల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నియంతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బీసీ మహిళ అని చూడకుండా, జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌ను ఏడిపించింది బీఆర్‌ఎస్ నాయకులు కాదా అని నిలదీశారు.

బీఆర్​ఎస్​ నేతలు ఏం చేయబోతున్నారో బండి సంజయ్‌కు ఎలా తెలుసు : పొన్నం ప్రభాకర్

బీసీ బిడ్డగా అడుగుతున్నా? కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు అధికారాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీ మంత్రిగా ఉన్న తాను ఉద్యమకారుడినే అణగారిన వర్గాలకు ఆప్తున్ని, సబ్బండ కులాలకు సోదరుడినని పేర్కొన్నారు. మంత్రిగా ఉండి బీసీల హక్కుల కోసం పోరాడతానని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్ష పదవి, లీడర్ ఆఫ్ అపోజిషన్ బీసీలకు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ పదవిని బీసీలకు ఎందుకు ఇవ్వలేదని కవితను ప్రశ్నించారు.

Minister Ponnam Reaction in Twitter on Ayodhya Ram Mandir : దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, ఫొటోలు పెట్టి రాజకీయాలు చేయొద్దని రవాణా పొన్నం ప్రభాకర్ బీజేపీకీ సూచించారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ (Ayodhya Prana Prathishtha) సందర్భంగా మంత్రిఎక్స్ వేదికగా స్పందించారు. తాను జన్మతః హిందువునని, నిన్న గుడికి పోయా, ఇవాళ పోయా, రేపు కూడా గుడికి పోతానని తెలిపారు. తాను నుదుట బొట్టు పెట్టుకుంటానని, దేవుడంటే భక్తి, భయం, శ్రద్ధ మూడు ఉన్నాయని స్పష్టం చేశారు. బీజేపీ (BJP) వారు చెప్పినట్టు వినకపోతే తాను హిందువుని కాదా అని పొన్నం ప్రశ్నించారు. దేవుడి ఫొటోలతో రాజకీయం చేయొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు గడిచిన పదేళ్లుగా ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • నేను జన్మతః హిందువుని..

    నిన్న గుడికి పోయా...!

    ఈరోజు గుడికి పోయా..!

    రేపు గుడికి పోతా..!

    నుదుట బొట్టు పెట్టుకుంటా..!

    దేవుడంటే భక్తి ,భయం ,శ్రద్ధ..!

    మీరు చెప్పినట్టు వినకపోతే నేను హిందువుని కాదా...?

    దేవుడి ఫొటోలు పెట్టి రాజకీయం చేయద్దు...

    తెలంగాణ రాష్ట్రానికి మా ప్రజలకు గత… pic.twitter.com/R6eiZXN3c4

    — Ponnam Prabhakar (@PonnamLoksabha) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MLC Kavitha Counter Tweet To Minister Ponnam : అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరితే మీరెందుకు రాజకీయ రంగు పులుముతున్నారని కవిత మండిపడ్డారు. భారత జాగృతి సంస్థ కోరడమే అభ్యంతరమా లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడం మీకభ్యంతరమా అని నిలదీశారు.

  • మంత్రి గారూ!

    అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ?

    భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా??

    అసెంబ్లీలో… https://t.co/Eb6nPs2YN0

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అంటూ ప్రశ్నించిన ఆమె, స్ఫూర్తిదాయక వీరులకు మీరిచ్చే గౌరవం ఇదేనా అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో రాజకీయాల కోసం సంకుచిత మనస్తత్వంతో ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని ఎక్స్‌ వేదికగా వివరించారు.

నేను బీఆర్​ఎస్​​ను తిడితే - పొన్నం ప్రభాకర్​కు కోపం ఎందుకు : బండి సంజయ్

అయోధ్య వేడుక వేళ నగరంలో ఆధ్యాత్మిక శోభ - ఎల్​ఈడీ తెరపై వీక్షించిన తమిళిసై

Last Updated : Jan 22, 2024, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.