ETV Bharat / politics

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - KAVITHA BAIL PETITION HEARING TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 12:23 PM IST

Updated : May 10, 2024, 1:10 PM IST

Kavitha Bail Petition Hearing Postponed : దిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్​ పిటిషన్​పై విచారణ వాయిదా పడింది. కవిత బెయిల్​ పిటిషన్​పై విచారణను దిల్లీ హైకోర్టు మే 24వ తేదీకి వాయిదా వేసింది.

Delhi Liquor Scam Case
Delhi Liquor Scam Case (ETV Bharat)

Kavitha Bail Petition Hearing Adjourned : దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలు జీవితం అనుభవిస్తున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్​పై విచారణ వాయిదా పడింది. కవిత బెయిల్​ పిటిషన్​పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో విచారణను మే 24వ తేదీకి దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. దిల్లీ మద్యం కేసులో రౌస్​ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ కవిత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన పిటిషన్​ను ఈ నెల 6వ తేదీన రౌస్​ అవెన్యూ కోర్టు డిస్మిస్​ చేసింది. దీంతో రౌస్​ అవెన్యూ కోర్టు తుది ఉత్తర్వులను హైకోర్టులో కవిత సవాల్​ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ జరగాల్సిన విచారణను ఈడీ సమయం కోరడంతో ధర్మాసనం వాయిదా వేసింది. దిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్​ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్​ జైలులో జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్నారు.

కవిత జ్యుడీషియల్​ కస్టడీ పొడిగింపు : మరోవైపు మే 7వ తేదీన ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్​ కస్టడీని మరో వారం రోజులు పొడిగిస్తూ రౌజ్​ అవెన్యూ కోర్టు తెలిపింది. ఈ జ్యుడీషియల్​ కస్టడీని పొడిగించాలన్ని దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఆమెకు మే 14వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. దీంతో ఆమె మే 14 వరకు తిహాడ్​ జైలులోనే ఉండనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా కోర్టులో ప్రవేశపెట్టాలన్ని ఆమె అభ్యర్థన మేరకు కోర్టు అందుకు తగినట్లు ఆదేశాలు జారీ చేసింది. ఆమె నేరుగా తన వాదనలను వినిపించారు.

అసలేం జరిగింది : దిల్లీ మద్యం విధానాన్ని ఎమ్మెల్సీ కవితకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలుగా ఆమ్​ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు ఆమె రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ ప్రధాన ఆరోపణలు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్​ నిరోధక చట్టం కింద ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. అలాగే ఏప్రిల్​ 11న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె దిల్లీలోని తిహాడ్​ జైలులో జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి అని బెయిల్​ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే బయటకి వచ్చి సాక్షులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే వీలుందని ఈడీ, ,సీబీఐ కోర్టును కోరుతోంది.

దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - Delhi liquor scam updates

'నా అరెస్టు చట్టవిరుద్ధం - రద్దు చేయండి' - సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్

Last Updated : May 10, 2024, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.