ETV Bharat / politics

3400 కోర్టు వాయిదాలకు జగన్‌ హాజరుకాలేదంటే ఏమనాలి?- మోసగాళ్లు ఎన్నికల్లో నీతులు చెబుతున్నారు : కనకమేడల - cases on jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 3:56 PM IST

MP Kanakameda Pressmeet : న్యాయ ప్రక్రియను అడ్డుకుంటున్న మోసగాళ్లు ఎన్నికల్లో నీతులు చెబుతున్నారని ఎంపీ కనకమేడల మండిపడ్డారు. సీఎం జగన్​ వివిధ కేసుల్లో 3400సార్లు కోర్టుకు హాజరుకాకుండా వాయిదాల పేరిట తప్పించుకున్నాడని తెలిపారు. 2012లో ఛార్జిషీట్‌ వేసినా ఇవాళ్టికి కేసు ముందుకు కదల్లేని పరిస్థితిపై కోర్టు అసహనం వ్యక్తం చేయడాన్ని ఆయన గుర్తుచేశారు.

tdp_mp_kanakamedala_on_jagan_cases
tdp_mp_kanakamedala_on_jagan_cases

MP Kanakameda Pressmeet : వందల కేసులు, న్యాయవ్యవస్థనే సవాల్​ చేసేలా ఏళ్ల తరబడి బెయిల్​ పై ఉంటూ కోర్టుకు హాజరుకాని జగన్​ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును నిందించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్​ విమర్శించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్​పై ఉన్న కేసులు, ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

'నవ సందేహాల'కు సమాధానమివ్వండి - సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల మరో లేఖ - Sharmila Letter To CM Jagan

పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటున్న జగన్మోహన్​ రెడ్డి క్రిమినల్​ బ్యాక్​గ్రౌండ్​ కలిగి ఉన్నారని కనకమేడల తెలిపారు. ఎన్నికల అఫిడవిట్​లో తనపై 11సీబీఐ 7ఈడీ కేసులతో పాటు మొత్తం 29 కేసులు ఉన్నట్లు స్వయంగా వెల్లడించారని వెల్లడించారు. అలాంటి వ్యక్తి సభ్య సమాజం తలదించకునేలా ఎన్నికల్లో చంద్రబాబును నిందిస్తున్నారని మండిపడ్డారు. ఎవ్వరూ వాడకూడని పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. దుష్టచతుష్టయం, విష సర్పం, ఆయనకు ఓటేస్తే విష సర్పం నోట్లో తలపెట్టినట్టే అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఏక వచనంతో సంబోధిస్తూ దుర్భాషలాడుతున్న పరిస్థితిపై ఎన్నికల సంఘం స్పందించాలని, జగన్​ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా వ్యాఖ్యలపై సీఈఓ కు ఇప్పటికే ఫిర్యాదు చేశామన్న కనకమేడల జగన్​ నోటి దురుసుపై బ్రేక్​ వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

టీడీపీ-జనసేన Vs వైఎస్సార్సీపీ మేనిఫెస్టో - ప్రజల స్పందన ఎలా ఉందంటే - NDA Manifesto VS YsrCP Manifesto

తనపై 29కేసులు ఉన్న ఆర్థిక ఉగ్రవాది జగన్​ మోహన్​ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రాబాబుపైనా కేసులు పెట్టించారని కనకమేడల తెలిపారు. చంద్రబాబుపైనా ఏపీ సీఐడీని ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయించారన్నారు. ఎన్నికల్లో ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా కేసుల వివరాలు కూడా వెల్లడించలేదని తెలిపారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తే తప్ప కేసుల వివరాలు బయటకు రాలేదని గుర్తు చేశారు. జగన్​ మోహన్​రెడ్డి తనపై సీబీఐ, ఈడీ కేసులు మొత్తం 29 ఉన్నాయని, ఆయా కేసుల్లో తానే ప్రథమ ముద్దాయి అని స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారని కనకమేడల తెలిపారు. చీటింగ్ కేసుల్లో ప్రథమ ముద్దాయి అని చెప్పుకున్న జగనే మోసకారే తప్ప చంద్రబాబు మోసకారి ఎలా అవుతారు అని ప్రశ్నించారు.

'హే కృష్ణా' చరిత్ర పునరావృతమేనా? - వారు అసెంబ్లీలో అడుగుపెట్టలేరా! - Tension in ministers

2012 మే 27 న అరెస్టయిన జగన్​ తిరిగి 2013 సెప్టెంబర్ 29న బెయిల్​పై బయటకు వచ్చారని, ఇప్పటికి వేల సంఖ్యలో కోర్టు వాయిదాలకు కూడా హాజరుకాలేదని తెలిపారు. జగన్​ బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టులో ఎస్​ఎల్​పీ దాఖలు చేశారని చెప్పారు. అవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడడం తదగని అన్నారు. బెయిల్‌ షరతుల్లో ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరుకావాలని, అత్యవసర పరిస్థితి ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఉన్నా వాటిని ఉల్లంఘించారని తెలిపారు. ఆయా కేసుల్లో జాప్యానికి తాము కారణం కాదని, ముద్దాయిలేనని సీబీఐ పిటిషన్లు వేసినట్లు తెలిపారు. 39 క్వాష్‌ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు వేశారని వివరించారు.

3400 వాయిదాలకు కోర్టుకు జగన్‌ హాజరుకాలేదంటే ఏమనాలి? నైతిక బాధ్యత వహించాల్సిన వ్యక్తి చంద్రబాబుపై నేరాలు చెబుతారా? అని కనకమేడల ధ్వజమెత్తారు. న్యాయ ప్రక్రియను అడ్డుకుంటున్న మోసగాళ్లు ఎన్నికల్లో నీతులు చెబుతున్నారని, పచ్చి అబద్ధాలు చెబుతున్న ఇలాంటి నేతలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అనారోగ్యకర చర్యలివి అని జగన్‌ను ఉద్దేశించి కోర్టు చెప్పే పరిస్థితి తెచ్చారని, న్యాయప్రక్రియను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు.

ఎన్నికల్ని సైతం వ్యాపారంగా మార్చేసిన పార్టీ - కొనుగోళ్లకు రూ. 9 వేల కోట్లకు పైగా 'సిద్ధం' - andhra pradesh elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.