ETV Bharat / politics

ఏపీ ఎన్నికల విజయంపై జనసేన ధీమా - పవన్ మెజారిటీపై భారీ అంచనాలు - Janasena Party Confident on Winning

author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 3:07 PM IST

Jana Sena Party on AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్​ పోటీ చేసిన పిఠాపురంలో గెలుపు ఖాయమని అంటున్నారు. అదే విధంగా జనసేన పోటీ చేసిన రెండు లోక్​సభ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ సీట్లలో 18 గెలవడం తథ్యమని తెలుస్తోంది.

Janasena Party Confident on Winning
Jana Sena Party on AP Elections 2024 (ETV Bharat)

Janasena Party Confident on Winning 2024: ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్‌సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేస్తోంది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టి పోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి. పోలింగ్​ పూర్తైన తరువాత పరిస్థితుల్ని విశ్లేషించి, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా పార్టీ వర్గాలు ఈ లెక్కలు వేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని సమాచారం.

జనసేన అధినేతకు భారీ మెజారిటీ: పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురంలో మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై అంచనాలు వేసుకుంటున్నారు. భారీ మెజారిటీ వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బరిలో నిలిచిన తెనాలిలోనూ గెలుపు ఖాయంగా మారింది. అక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ వ్యవహరించిన తీరు సంచలనమైంది. ఆయన పోలింగ్‌ కేంద్రంలో ఓటరును కొట్టడంతో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు పక్కా - ఏపీలోనూ క్లీన్‌ స్వీప్‌ : చంద్రబాబు - CHANDRABABU ON NDA 400 SEATS TARGET

పాలకొండ, పోలవరం వంటి ఎస్టీ రిజర్వు నియోజకవర్గాల్లో జనసేన పోటీకి దిగింది. తొలుత అక్కడ గట్టి పోటీ కనిపించినా చివరకు రెండు స్థానాల్లోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. రాజోలులో జనసేనకు మద్దతు ఏకపక్షంగా లభించిందని క్షేత్రస్థాయి సమాచారం. గన్నవరంలో కొంతమేర పోటీ ఎదురైందని చెబుతున్నారు. రాజానగరంలో తొలుత గట్టిపోటీ ఉంటుందని భావించినా చివరకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పోటీ చేసిన ప్రతిచోట గెలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నెల్లిమర్లలో తొలుత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా క్రమేణా అభ్యర్థి మాధవి టీడీపీ శ్రేణులతో కలిసి పని చేయడం, ఆ పార్టీ ఇన్‌ఛార్జి పూర్తిస్థాయిలో సహకరించడం కలిసొచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకారం పి.గన్నవరం, రైల్వేకోడూరు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైందని సమాచారం. వీటిలో కొద్ది మెజారిటీతోనైనా బయటపడతామనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి.

రెండు చోట్లా జయకేతనమే: మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో పూర్తి అనుకూల పరిస్థితులున్నాయని అంచనా. కాకినాడ లోక్‌సభ సీటులో కొంతమేర క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలిసింది. కాకినాడ గ్రామీణ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలవడం, పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ లోక్‌సభ అభ్యర్థికి అనుకూలమైన అంశాలుగా మారాయి. సామాజికవర్గంతో పాటు టీడీపీ, బీజేపీ పొత్తు ఈ లోక్‌సభ నియోజకవర్గంలో జనసేనకు సానుకూలమైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ యువత, పార్టీ క్యాడర్‌ ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. కూటమి మద్దతు ఇచ్చిన అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు జనసేన యువత అండగా నిలిచారు. కొన్నిచోట్ల ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులను క్యాడర్‌ గట్టిగా ఢీకొంది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోలింగ్‌ తర్వాత ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సమాచారం.

తీర్పు అద్భుతంగా ఉండబోతోంది: ఓటర్ల తీర్పు అద్భుతంగా ఉండబోతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. వైఎస్సార్సీపీ పాలన పోవాలని, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జనం బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకోవడం స్ఫూర్తిదాయమన్నారు. మాట ఇచ్చినట్లుగా ప్రజలు కోరుకున్న రీతిలో సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలికోన్నత పాఠశాలలో తాను ఓటు వేశానట్లు నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

ఓటరుపై దాడి ఘటన - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు - CASE BOOKED ON TENALI MLA IN AP

పోస్టింగ్​లోనే కాదు - ఓటు హక్కు కల్పించడంలోనూ కక్ష సాధింపే - AB Venkateswara Rao Vote Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.