ETV Bharat / politics

24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ సీట్లు - జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 12:27 PM IST

Updated : Feb 24, 2024, 7:41 PM IST

Janasena MLA Candidates List : ఆంధ్రప్రదేశ్​ శాసనసభ, పార్లమెంట్​ ఎన్నికలకు సంబంధించి జనసేన పోటీ చేసే స్థానాలపై ఓ క్లారిటీ వచ్చింది. నేడు 118 అసెంబ్లీ స్థానాలకు తొలి జాబితా విడుదల చేయగా, అందులో 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో దిగనున్నట్లు ప్రకటించారు.

Janasena MLA Candidates List
Janasena MLA Candidates List

Janasena MLA Candidates List : ఆంధ్రప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో ఈసారి టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు రెండు పార్టీల తరఫున తొలి జాబితా విడుదల చేశారు. మొత్తం 175 స్థానాలకు గానూ ఫస్ట్​ లిస్ట్​లోనే 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ బరిలో దిగుతుండగా, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో దిగనున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్​ ఎన్నికలకు సంబంధించిన సీట్లపైనా ఇరుపార్టీల నేతలు ఓ క్లారిటీ ఇచ్చారు. 25 ఎంపీ స్థానాల్లో 3 చోట్ల జనసేన పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

*జనసేన అభ్యర్థులు*

  • తెనాలి - నాదెండ్ల మనోహర్
  • నెల్లిమర్ల - లోకం మాధవి
  • అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
  • కాకినాడ రూరల్ - పంతం నానాజీ
  • రాజానగరం - బత్తుల బలరామకృష్ణ

రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే మా కలయిక : రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన కలయిక జరిగిందని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ స్పష్టం చేశారు. ఈ కూటమికి బీజేపీ శుభాశీస్సులు ఉన్నాయని తెలుపుతూ జనసేన తరఫున ఐదుగురు శాసనసభ అభ్యర్థులను ప్రకటించారు.

"టీడీపీ అభ్యర్థులను నేను ఎంపిక చేస్తా. జనసేన అభ్యర్థులను పవన్‌ కల్యాణ్‌ ఎంపిక చేస్తారు. మొదటి విడత 94 సీట్లకు అభ్యర్థులను జాబితాను విడుదల చేస్తున్నాం. జనసేన, టీడీపీ మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు జరిపాం. రాజమండ్రి రూరల్‌ సీటు విషయంలో తెలుగుదేశం - జనసేన ఆశావహులు ఇద్దరికీ న్యాయం జరుగుతుంది. గొరంట్ల బుచ్చయ్య, దుర్గేశ్‌లో ఎవరో ఒకరికి రాజమండ్రిలో మరొకరు వేరే చోట పోటీ చేస్తారు. వైసీపీ తరపున దోపిడీ దారులు అభ్యర్థులుగా నిలబడుతున్నారు." - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

"జన సేన నుంచి 24 స్థానాలలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని దృష్షిలో పెట్టుకొని సీట్లను తగ్గించుకుంటాం. వ్యక్తి ప్రయోజనాల కంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. కష్టపడి పనిచేసిన అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వారికి తగిన పదవి ఇస్తాం. వైసీపీ ఎన్ని పన్నాగాలు పన్నిన వాటిని ఎదుర్కొనడానికి సమర్థవంతంగా పనిచేస్తాం."- పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

మిగతా సీట్లపై కూడా కసరత్తు జరుగుతోందని ఇరువురు నేతలు ప్రకటించారు. త్వరలోనే ఈ జాబితా కూడా ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ కోసం కృషి చేసిన నేతలకు అన్యాయం జరగనివ్వబోమని, వారికి అన్ని విధాలా పార్టీ తరపున ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. మరవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది.

బటన్‌ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్​తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు

ఎన్నికల తంతు అంతా సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పినట్టే : చంద్రబాబు

Last Updated :Feb 24, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.