ETV Bharat / politics

విద్వేషాలు రెచ్చగొట్టు, సానుభూతి పట్టు - ముఖ్యమంత్రి జగన్​ మొసలి కన్నీరు ! - Ycp Sympathy Politics

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 4:58 PM IST

CM Jagan Sympathy Politics : ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తోన్న జగన్ మరోవైపు​ సానుభూతి ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైఎస్సార్సీపీ డర్టీ పాలిటిక్స్​ పై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

cm__jagan_sympathy_politics
cm__jagan_sympathy_politics

CM Jagan Sympathy Politics : ఆంధ్రప్రదేశ్​లో అధికార మార్పిడి ఖాయమన్న సంకేతాలు కాబోలు ముఖ్యమంత్రి జగన్​లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఐదేళ్లుగా సభలు, సమావేశాల్లో తనను తాను కీర్తించుకున్న జగన్​ తాజాగా స్వరం మార్చారు. ప్రజలకు ఏదైనా మంచి జరిగిందంటే అది తనవల్లేనని చెప్పుకుంటూ వైఫల్యాలను మాత్రం ప్రతిపక్షాలపై నెట్టేస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే అనే విషయాన్ని జగన్​ మర్చిపోయారని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్నదాతలకు జగనన్న చేసిందేమిటి? - ఇచ్చిన హామీలు నెరవేర్చారా? - What CM Jagan done for farmers

గత ఎన్నికల్లో వైఎస్​ వివేకా హత్య, కోడికత్తి దాడిని ప్రతిపక్షాలపై నెట్టేసి సానుభూతి ఓట్లతో గెలిచిన జగన్ ఈసారి ఎన్నికల్లోనూ అదే తరహా స్ట్రాటజీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 'సీఎం జగన్​మోహన్​ రెడ్డికి పతనం తప్పదని అర్థమైంది. అధికారం పోతుందనే ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోంది. అందుకే వాళ్లంతా ఏకమయ్యారంటూ బేలగా, బలహీనంగా దిగజారిపోయి ఓటర్ల సానుభూతిని కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు' అంటూ ప్రతిపక్ష నేతలు పేర్కొంటున్నారు. ప్రజల ఆలోచనలను మళ్లించేలా ఐదేళ్ల పాలనలో వైఫల్యాలను సైతం విపక్షాలపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

మద్యంతో జగన్‌కు ఆదాయం కిక్కు - పేదల ప్రాణాలకు ముప్పు: ఎన్టీఏ నేతలు - NDA Leaders on Liquor Ban IN AP

ముఖ్యమంత్రి హోదాలో జనానికి దూరంగా పర్యటనలు సాగించిన జగన్​, ఎన్నికల ప్రచారంలో వారిని కౌగిలింతలు, ముద్దుల్లో ముంచెత్తుతున్నారు. గతంలో పరదాల మాటున పర్యటించిన సీఎం తాజాగా పక్కా ప్లానింగ్ ప్రకారం సానుభూతి సీన్లు క్రియేట్​ చేస్తున్నారు. సిద్ధం సభా వేదికపై ఉన్నా తమను కన్నెత్తి చూడని జగన్​ చేతులెత్తి నమస్కరిస్తూ, ర్యాంప్​ వాక్ చేస్తున్న దృశ్యాలు పొర్లు దండాలను గుర్తు చేస్తున్నాయని సొంత పార్టీ నేతలూ విమర్శిస్తున్నారు.

గతంలో తాను ఒక్కడిని కాదని, తన వెంట వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మొత్తం 2.30 లక్షల మంది ఉన్నారని, వాళ్లందరూ ప్రభుత్వ సైనికులని చెప్పుకున్న జగన్, ఎన్నిక వేళ మాత్రం మాట మార్చాడు. తాను ఒక్కడిగానే బరిలోకి దిగానని, ప్రతిపక్షాలు అందరూ కలసి తనపై దాడికి దిగుతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారు.

పల్నాడు పరిశ్రమలకు వైసీపీ గ్రహణం - జగన్‌ దెబ్బకు మూసివేత - industries closing in ap

యథారాజా తథా ప్రజా అన్నట్లుగా జగన్​ అనుచర గణం సైతం వ్యవహరిస్తున్నారు. తామేం తక్కువ? అన్నట్లుగా క్షేత్రస్థాయిలో సానుభూతి కోసం విఫలయత్నాలు చేస్తున్నారు. వడదెబ్బతో చనిపోయిన వృద్ధురాలి ఇంటికి వెళ్లిన వైఎస్సార్సీపీ మంత్రి ఒకరు అందుకు చంద్రబాబే కారణమంటూ బంధువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 'మీ శవ రాజకీయాలు మాకొద్దు' అంటూ వృద్ధురాలి బంధువులంతా గట్టిగా బుద్ధి చెప్పడంతో తోక ముడిచారు.

నంద్యాలలో డిస్కౌంట్ ముసుగులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైఎస్సార్సీపీ నేతకు చెందిన సూపర్​ మార్కెట్​ను ఈసీ మూయించేసింది. కాగా, టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే డిస్కౌంట్ నిలిచిపోయిందని రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.

ఏంటీ వీళ్లు మంచోళ్లా? - ఒకసారి ఈ అరాచకాలు చూద్దామా జగన్? - CM Jagan Lies about YCP Candidates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.