ETV Bharat / politics

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్, బీజేపీ మైత్రి బట్టబయలైంది : హరీశ్‌రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 12:24 PM IST

Harish Rao Fires On Tamilisai : తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో హస్తం పార్టీ, కమలం పార్టీల మధ్య ఉన్న రహస్య మైత్రి బయటపడిందని ఆరోపించారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా తమిళిసై వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Harish Rao
Harish Rao

Harish Rao Fires On Tamilisai : రాష్ట్రంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం, సియాసత్‌ పత్రిక ఎడిటర్‌ ఆమిర్‌ అలీఖాన్‌లు ఎంపికయ్యారు. వీరిద్దరి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ఆమోదం తెలిపారు. దీనిపై తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న రహస్య మైత్రి బయటపడిందని హరీశ్‌రావు ఆరోపించారు.

  • కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు.

    రాజకీయ పార్టీల్లో…

    — Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Harish Rao Tweet on Governor Quota MLCs : బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ (Governor Tamilisai Soundara Rajan) వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గతంలో తమ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను గవర్నర్ ఎమ్మెల్సీలుగా నియమించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే తమిళిసై ఆమోదించారని హరీశ్‌రావు విమర్శించారు.

దావోస్​కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్​రావు

Harish Rao Tweet Today : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై బీఆర్‌ఎస్‌ను అణగదొక్కాలని చూస్తున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం దురదృష్టకరమని అన్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని చెప్పారు. కానీ గులాబీ పార్టీకి, హస్తం పార్టీకి మధ్య తమిళిసై తేడా చూపిస్తున్నారని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.

Governor Quota MLCs in Telangana : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం (Professor Kodandaram), సియాసత్‌ పత్రిక ఎడిటర్‌ ఆమిర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమిళిసై ఆమోదించారు. ఫ్రొఫెసర్‌ ముద్దసాని కోదండరాం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్‌లో 1955 సెప్టెంబరు 5న జన్మించారు. ఆయన తల్లిదండ్రలు వెంకటమ్మ, ఎం.జనార్దన్‌. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాన్ని స్థాపించి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో విద్యార్థుల సమస్యలపై కోదండరాం నిరాహార దీక్ష చేపట్టారు.

Telangana MLCs 2024 : కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ)కి 2009 నుంచి రాష్ట్రం వచ్చేవరకు నాయకత్వం వహించారు.

'ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నాం - లేదంటే చీల్చి చెండాడేవాళ్లం'

పాత్రికేయ రంగంలో గుర్తింపు : ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్‌ చీఫ్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు ఆమిర్‌ అలీఖాన్‌(50). ఆయన పాత్రికేయ రంగంలో విశేష గుర్తింపు పొందారు. ఓయూలో కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ పొందారు. ఎంబీఏ సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ కళాశాలలో పూర్తి చేశారు. ఆయనకు హిందీ, అరబిక్‌, ఆంగ్లం, ఉర్దూ, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉంది.

1994 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. వృత్తిలో భాగంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రిలతో దేశ, విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. 2002లో జర్మనీలోని గోథే ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ విజిటర్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగమయ్యారు. ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ, రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ ఆమిర్ అలీఖాన్‌ (Amer Ali Khan)రాసిన వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి.

పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచీ చూపి - హామీల అమలు వాయిదా వేసే యత్నం: హరీశ్‌రావు

రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుంది - హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.