ETV Bharat / politics

మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా - కేసీఆర్​ ఎలా వస్తారో చూస్తా : రేవంత్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 5:44 PM IST

Updated : Feb 14, 2024, 8:01 PM IST

CM Revanth On Constable Appointment Documents Distribution : పదేళ్లపాటు ముఖ్యమంత్రిగానే కొనసాగుతానని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మళ్లీమేమే వస్తామని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారన్న రేవంత్, మళ్లీ ఎలా సీఎం అవతారో చూస్తానని సవాల్‌ విసిపారు. ఎవరు అడ్డుపడ్డా అనుకున్న సమయానికి అన్ని నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 16,604 మంది అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంలో ఆయన ఎంపిక పత్రాలను అందజేశారు.

CM Revanth On KCR
CM Revanth On Constable Appointment Documents Distribution

మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా - కేసీఆర్​ ఎలా వస్తారో చూస్తా : రేవంత్​ రెడ్డి

CM Revanth On Constable Appointment Documents Distribution : ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో, నేడు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నప్పుడు అంతే సంతోషం కలుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డుపడ్డా, కేసీఆర్, హరీశ్​రావు(Harish Rao)​ చొక్కా లాగు చించుకున్నా ఇచ్చిన మాట ప్రకారం, అనుకున్న సమయానికి అన్ని నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్​ఎస్​ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం, కృష్ణా జలాలకు మరణశాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. వారి తప్పును కప్పిపుచుకునేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌పై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దికోసమే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో(AP CM Jagan) కలిసి కేసీఆర్‌ కొత్తనాటకానికి తెరతీశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర న్యాయమైన హక్కుల కోసం దిల్లీతో కొట్లాడుతామంటే ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.

"కేసీఆర్​ను శాసనసభ రమ్మంటే రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే కానీ నల్గొండకు పోయి బీరాలు పలుకుతున్నారు. పాలిచ్చే బర్రెను ఇంటికి పంపి, దున్నపోతును తెచ్చుకున్నారని పొంకనాలు పలుకుతున్నారు. శాసనసభలో అటెండర్​ ఒకాయన ఎదురుపడి, ఒకమాట చెప్పిండు కంచర గాడిదను ఇంటికి పంపి-రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని చెప్పమని. ఆయనంట మళ్లీ వస్తారంట, ఎట్లా వస్తారు నడవనీకే చక్కగా అవ్వటం లేదు. ఈ తెలంగాణను మీ కుటుంబం కోసమే బలిచ్చిన మిమ్మల్ని, పిల్లలు పోలీసులై లాఠీలతో కొట్టి లాకప్​లో వేస్తారు."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

ఎవరు అడ్డుపడ్డా, అన్ని నియామకాలు పూర్తి చేస్తాం : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటకు తీస్తుండటంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు మరోసారి కేసీఆర్‌ నీళ్లదారి పట్టారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే నల్గొండలో సభ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని మండిపడ్డారు. మరోసారి సీఎం అవుతానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ సర్కారు(BRS Party) పదేళ్ల పాలనలో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారన్న సీఎం రేవంత్‌రెడ్డి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రెండు లక్ష ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

CM Revanth Reddy Fire on KCR : పదేళ్లే కాదు, ప్రజలు ఆమోదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని తెలిపారు. పంజాబ్‌ తరహాలో రాష్ట్రాన్ని మార్చేందుకు మత్తుపద్దార్ధాల ముఠాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయన్న రేవంత్‌రెడ్డి, వారిపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గంజాయి మొక్కలు ఉండొద్దన్న ఆయన, మత్తుపదార్ధాలను(Drugs) సమూలంగా నాశనం చేస్తామని ప్రతినబూనాలని సూచించారు. పోలీస్ నియామాకాల్లో ఎంపికైన 16,604 మంది అభ్యర్థులకు హైదరాబాద్‌ ఎల్బీస్టేడియం వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరావు, డీజీపీ రవిగుప్తా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్​ రెడ్డి

వారి తప్పులన్ని సరిచేయడానికి తీర్మానం - సంపూర్ణ మద్దతు ఇస్తారా లేదా చెప్పండి: భట్టి

Last Updated : Feb 14, 2024, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.