ETV Bharat / opinion

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 7:37 PM IST

Eenadu - Etv Conduct Vote Registration Awareness Camp : ప్రతిఒక్కరూ విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరాన్ని యువతకు తెలియపరచాలనే ఉద్దేశ్యంతో ' ఈనాడు - ఈటీవీ ' ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యువత నుంచి విశేష స్పందన లభిస్తుంది.

eenadu_etv
eenadu_etv

ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు

Eenadu - Etv Conduct Vote Registration Awareness Camp : రాజ్యాంగం మనందరికీ ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని బలోపేతం చేసుకోవాలని రాష్ట్రంలో వివిధ కళాశాల్లో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోంది.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి - 'ఈనాడు-ఈటీవీ' అవగాహన సదస్సు

Vote Registration Awareness in Prakasam District : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకొని, ప్రజలకు మేలు చేసే ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని రైజ్​ ఇంజనీరింగ్​ కాలేజీ డైరెక్టర్​ భాస్కరరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రైజ్​ ఇంజనీరింగ్​ కాలేజీలో ' ఈనాడు - ఈటీవీ ' ఆధ్వర్యంలో ఓటు నమోదు, అవగాహన చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా కాలేజీ డైరెక్టర్​ భాస్కరరావు, ప్రిన్సిపాల్​ సుబ్రహ్మణ్యం, మంగుళూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.

సమాజ అభివృద్ధికి ఓటు ఎంతో కీలకం - ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

Ongole : దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు అనేది వజ్రాయుధం లాంటిందని భాస్కర్​ రావు పేర్కొన్నారు. అందుకే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధాన్ని అమ్ముకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఒకసారి ఓటును అమ్ముకుంటే ఐదు సంవత్సరాలకు వరకు వారికి బానిసలుగా ఉండాలని తెలియజేశారు. ఎన్నికల్లో ఒక్క ఓటుతోనే గెలుపు, ఓటమిలను నిర్ణయించే అధికారం ఉందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఓటు ప్రాముఖ్యతను తెలియజేయవలసిందిగా సూచించారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవడం యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. కొత్తగా ఓటును నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌ విధానంలో చేసుకోవచ్చాన్నారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటు నమోదు అవగాహన సదస్సులు
Vote Registration Awareness Camp in Annamayya District : అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శిరిడి సాయి మహిళా డిగ్రీ కళాశాలలో ' ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు, చైతన్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ బాలాజీ నాయక్​ హాజరై, యువతకు ఓటు ప్రాధాన్యతను విద్యార్థినులకు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్​ ఇచ్చిన గడువులోపు ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. యువతకు ఓటు నమోదు, హక్కుపై చైతన్యం కల్పించిన ' ఈనాడు - ఈటీవీ ' యాజమాన్యాన్ని కళాశాల చైర్మన్​ చలమారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమం అనంతరం కళాశాల విద్యార్థులకు బీఎల్​వో ద్వారా ఓటును నమోదు చేయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.