ETV Bharat / international

ఐరాస ఆఫీస్​ కింద హమాస్‌ భారీ సొరంగం- విద్యుత్​, ఆయుధాలతో 18 మీటర్ల లోతులో నిర్మాణం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 2:21 PM IST

Updated : Feb 11, 2024, 2:56 PM IST

Israel Finds Hamas Tunnel : గాజాలో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ హెడ్‌క్వార్టర్స్‌ భవనాల కింద భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం గుర్తించింది. 700 మీటర్ల పొడవున 18 మీటర్ల లోతులో ఈ సొరంగాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 7న హమాస్‌ చేసిన మారణకాండలో సదరు ఏజెన్సీ ఉద్యోగుల పాత్రపై ఇజ్రాయెల్‌ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది.

Israel Finds Hamas Tunnel
Israel Finds Hamas Tunnel

Israel Finds Hamas Tunnel : గాజాలో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి రిలీఫ్​ అండ్ వర్క్స్​ ఏజెన్సీ (UNRWA) హెడ్‌క్వార్టర్స్‌ భవనాల కింద భారీ సొరంగాన్ని (Israel Discovers Hamas Tunnel) ఇజ్రాయెల్‌ మిలిటరీ గుర్తించింది. దీనికి సంబంధించి ఎక్స్‌ వేదికగా వీడియోను పోస్టు చేసింది. తమ కార్యకలాపాల కోసం హమాస్‌ ఈ సొరంగం నిర్మించి, దీనికి విద్యుత్‌ సదుపాయం ఏర్పాటు చేసుకున్నట్లు IDF తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 7న హమాస్‌ మారణకాండకు సంబంధించి ఆ ఏజెన్సీకి చెందిన ఉద్యోగుల పాత్రపై ఇజ్రాయెల్‌ చేస్తున్న ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చినట్లైంది.

Israel Finds Hamas Tunnel
ఇజ్రాయెల్ గుర్తించిన సొరంగం

ఏజెన్సీకి నిధుల మంజూరు నిలిపివేసిన అగ్రరాజ్యం
అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మారణకాండలో UNRWA ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఇజ్రాయెల్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆ ఏజెన్సీ కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లజారి, దాడికి సంబంధించి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న 12 మంది సిబ్బందిని తొలగించారు. వారిపై విచారణ చేపడతామని ప్రకటించారు. ఈ కారణంగా ఇజ్రాయెల్‌, ఐరాస ఏజెన్సీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సరకుల సరఫరాను అడ్డుకోవడమే కాకుండా దాని పన్ను ప్రయోజనాలను రద్దు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐరాస ఏజెన్సీకి నిధుల మంజూరును నిలిపివేస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా ప్రకటించాయి. ఫలితంగా ఈ సంస్థ తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి జారుకుంది.

Israel Finds Hamas Tunnel
ఇజ్రాయెల్ గుర్తించిన సొరంగం
Israel Finds Hamas Tunnel
ఇజ్రాయెల్ గుర్తించిన సొరంగం

18 మీటర్ల లోతులో నిర్మాణం
UNRWA హెడ్‌క్వార్టర్స్‌ భవనాల (Tunnel Under UNRWA) కింద ఉన్న ఈ సొరంగాన్ని 700 మీటర్ల పొడవు 18 మీటర్ల లోతులో నిర్మించారు. విద్యుత్‌ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. ఇందులో బ్యాటరీలు, విద్యుత్‌ పరికరాలు, ఆయుధాలు, సామగ్రి, గ్రనేడ్లు లభించినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది. సొరంగంలో ఐరాస ఏజెన్సీ సర్వర్‌ రూమ్‌తో అనుసంధానం అయిన హమాస్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను గుర్తించినట్లు IDF పేర్కొంది. తాజా ఘటనపై స్పందించిన UNRWA, తమ కార్యాలయం కింద సొరంగం ఉందని, దానికి విద్యుత్‌ సరఫరా ఉన్నట్లు తమకు తెలియదని పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ చేపడతామని వెల్లడించింది.

Israel Finds Hamas Tunnel
ఇజ్రాయెల్ గుర్తించిన సొరంగం
Israel Finds Hamas Tunnel
ఇజ్రాయెల్ గుర్తించిన సొరంగం
Israel Finds Hamas Tunnel
ఇజ్రాయెల్ గుర్తించిన సొరంగం

రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 12 మంది చిన్నారులు సహా 44 మంది మృతి

135 రోజులపాటు కాల్పుల విరమణ ప్రతిపాదన- తగ్గేదేలే అన్న నెతన్యాహు

Last Updated : Feb 11, 2024, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.