విజయ్​ సినిమాలో దివంగత నటుడు - టెక్నాలజీ సాయంతో అతిథిగా ఎంట్రీ!

author img

By ETV Bharat Telugu Desk

Published : Feb 13, 2024, 6:49 PM IST

Vijayakanth In GOAT Movie

Vijayakanth In GOAT Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్​ ఆల్ టైమ్​) అనే సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో దివంగత నటుడు విజయకాంత్​ కనిపించనున్నారట. అది ఎలాగంటే ?

Vijayakanth In GOAT Movie : ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్​ తన అప్​కమింగ్ మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. 'ద గోట్' (ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)​ అనే యాక్షన్​ థ్రిల్లర్​లో ఆయన కీ రోల్​ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో దివంగత నటుడు అతిథి పాత్రలో కనిపించనున్నరన్న వార్తలు వస్తున్నాయి.

అదేంటీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విజయ్​కాంత్ ఈ చిత్రంలో ఎలా యాక్ట్ చేశారని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆయన కేమియో పాత్రలో కనిపించింది నిజమే, కానీ ఆయన రోల్​ను టెక్నాలజీ సాయంతో ఈ సినిమాలో చూపించనున్నారట. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన గ్రాఫిక్స్​ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇది విన్న కెప్టెన్ ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ స్టార్ హీరోను ఇలా అయినా మరో సారి స్క్రీన్​పై చూడొచ్చు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

The GOAT Movie Cast : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్​ ద్విపాత్రాభినయం చేయనున్నారట. అందులో స్టార్ హీరో యంగ్ రోల్​లోనూ మెరవనున్నారట. అయితే ఆయన్ను 10 నిమిషాల పాటు వింటేజ్​ లుక్​లో చూపించేందుకు మూవీ టీమ్ డీ-ఏజింగ్​ టెక్నాలజీ వాడుతోందట. విదేశీ నిపుణుల సహాయంతో దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేసి విజయ్​ వయసు తగ్గించనున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవలే విడుదలైన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు కూడా ఆడియెన్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్​ కూడా శరవేగంగా కొనసాగుతోంది.

The GOAT Movie OTT Rights : మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమచారం. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. సీనియర్ నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగి బాబు సహా పలువురు నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వింటేజ్​ లుక్​లో దళపతి విజయ్- 10 నిమిషాల కోసం రూ.6 కోట్లు ఖర్చు!

నో చెప్పిన విజయ్- హిట్ కొట్టిన విశాల్​- ఏ సినిమానో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.