ETV Bharat / entertainment

రూ.190కోట్ల బడ్జెట్ - కలెక్షన్స్​ రూ.15 కోట్లే! - Biggest Disaster movie

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 5:53 PM IST

దాదాపు రూ.190కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఓ భారీ ఇండియన్​ సినిమా లాంగ్ రన్​ టైమ్​లో దాదాపు రూ.15 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. బాకాఫ్సీస్ ముందు భారీ డిజాస్టర్​గా నిలిచింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Getty Images
movie (Getty Images)

Ganapath Movie : తెరపైకి వచ్చే ప్రతీ చిత్రం ఎన్నో అంచనాలతో, ఆశలతో తెరకెక్కుతుంటాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి. మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతాయి. స్టార్​​​ నటీనటులు, భారీ బడ్జెట్‍తో తెరకెక్కినవి కూడా బాక్సాఫీస్​ వద్ద బోల్తా పడుతుంటాయి. అలాంటి ఓ చిత్రమే గణ‍పత్. టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఊహించని రేంజ్​లో అట్టర్​ ఫ్లాప్​గా నిలిచింది.

కథేంటంటే? - గణపత్ సినిమా 2070 కాలం బ్యాక్‍డ్రాప్‍తో తెరకెక్కింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ప్రతినాయకుల వల్ల కష్టాలను ఎదుర్కొనే ప్రజలను కాపాడేందుకు వచ్చిన రక్షకుడు గణపత్ అనే పాత్రలో హీరో టైగర్ ష్రాఫ్ నటించారు. భారీ విజువల్స్​, యాక్షన్​కు పెద్ద పీట వేస్తూ సినిమాను తెరకెక్కించారు. అలా ట్రైలర్​తో కాస్త క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం 2023 అక్టోబర్ 30న మంచి అంచనాలతో విడుదలైంది. కానీ మొదటి షో నుంచే నెగెటివ్ టాక్‍తో డీలా పడింది. కథ బాలేదని, గ్రాఫిక్స్ విషయంలోనూ పేలవంగా ఉందంటూ విమర్శలు వినిపించాయి.

దారుణంగా కలెక్షన్స్​ - ఈ చిత్రం దాదాపు రూ.190కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని తెలిసింది. కానీ ఫుల్ రన్‍ టైమ్​లో రూ.15కోట్ల కలెక్షన్లను కూడా అందుకోలేదని తెలిసింది. రూ.13కోట్ల వసూళ్లే వచ్చాయని బయట కథనాలు ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఈ చిత్రం డిజాస్టర్ టాక్​ను అందుకుందో అర్థం చేసుకోవచ్చు. గుడ్‍కో, పూజా ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్​పై వికాస్ బహ్ల్, వషు భగ్నానీ, దీప్షికా దేశ్‍ముఖ్, జాకీ భగ్నానీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

ఓటీటీలోకి రాకముందే టీవీలోకి - సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజ్ అయిన రెండు మూడు నెలల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత టీవీలో ప్రసారం అవుతుంది. కానీ ఈ చిత్రం విడుదలై ఏడు నెలలు దాటినా ఇంకా ఓటీటీలోకి రాలేదు. కానీ బుల్లితెరపైకి ప్రసారమైంది. కాగా, ఈ చిత్రాన్ని నెట్​ఫ్లిక్స్​ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వారం 15 క్రేజీ సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases

కేన్స్​లో చరిత్ర సృష్టించిన అనసూయ- సెక్స్ వర్కర్​ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు - Cannes Film Festival 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.