రూ.23 కోట్ల ఖరీదైన వజ్రాల వాచ్ కొనుగోలు చేసిన స్టార్ హీరో - ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 12:35 PM IST

Updated : Mar 1, 2024, 1:09 PM IST

SALMAN WATCH

సినీ హీరోలకు సాధారణంగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే ఖరీదైన వస్తులులు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఓ హీరో చేతికి ధరించే వాచ్​ కోసం రూ.23 కోట్లు వెచ్చించారు! మరి ఆయన ఎవరు? ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే?

Salman Khan Watch: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాప్​ హీరోల లిస్ట్​లో అగ్రస్థానంలో ఉంటారు. ఒక్కో సినిమాకు ఆయన రెమ్యునరేషన్ రూ. కోట్లలో ఉంటుంది. ఇదే కాకుండా వ్యాపార రంగంలో, ఎండార్స్​మెంట్స్​, యాడ్స్​ రూపంలో కూడా సంపాదించే సల్మాన్ లగ్జరీ లైఫ్​ లీడ్ చేస్తుంటారు. అయితే మామూలుగానే ఆయనకు రిస్ట్ వాచ్​ (Wrist Watch)లు అంచే చాలా ఇష్టం. వాచ్​ కలెక్షన్​లో సల్మాన్​ ఎప్పుడూ ముందుంటారట.

అయితే రీసెంట్​గా సల్మాన్ కలెక్షన్​లోని ఓ వాచ్ హాట్​టాపిక్​గా మారింది. ఆయన డైమండ్స్​ పొదిగిన వాచ్​ ధరించి రీసెంట్​గా ఓ ఫొటోకు పోజిచ్చారు. అయితే ఈ ఫొటోలో సల్మాన్ ధరించిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్​లు ధరించడం కొత్తేం కాదు. కానీ, ఆయన గతంలో ధరించిన వాచ్​ల ఖరీదు ఎక్కువలో ఎక్కువ రూ.4కోట్ల విలువైనవి!

అయితే ఇన్​స్టాగ్రామ్​లోని ఓ ప్రముఖ పేజ్ ప్రకారం తాజాగా సల్మాన్ ధరించిన వాచ్ ధర అక్షరాల రూ.23కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అది పాటెక్ ఫిలిప్ రెయిన్​ బో (Patek Philippe Rainbow Watch)అనే కంపెనీకి చెందిన వాచ్​ అని సమాచారం. దాంట్లో దాదాపు 130 వజ్రాలు పొదిగి ఉన్నాయట. దీందో ఆ వాచ్ ధర తెలిసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'అంబాని లెవెల్ రిస్ట్​ గేమ్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'ఓన్లీ భాయ్ థింక్స్' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. దీంతో సల్మాన్ ఖాన్ వాచ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tiger- 3: సల్మాన్ ఖాన్ రీసెంట్​గా టైగర్- 3 సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. యశ్​ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. మనీశ్​ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రీతమ్, తనూజ్​ టింకూ సంగీతం సమకూర్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ కత్రినా కైఫ్, సల్మాన్​కు జంటగా నటించగా, నటుడు ఇమ్రాన్​ హష్మీ విలన్‌ పాత్రలో కనిపించారు. ఇక సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జెత్వా, కుముద్ మిశ్రా, రణ్‍వీర్​ షోలే తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. బాక్సాఫీస్ వద్ద రూ.400+ కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్​ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉంది.

సల్మాన్​ పేరుతో మోసం - వారికి హీరో టీమ్ స్ట్రాంగ్​ వార్నింగ్​!

బాలీవుడ్​లో త్రిష రీ ఎంట్రీ!- సల్మాన్​తో స్క్రీన్ షేరింగ్ నిజమేనా?

Last Updated :Mar 1, 2024, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.