ETV Bharat / entertainment

క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి - ప్రముఖుల సంతాపం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 11:59 AM IST

Updated : Feb 2, 2024, 12:49 PM IST

ప్రముఖ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే కన్నుమూశారు. సర్వైకల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

Poonam Pandey Death
Poonam Pandey Death

Poonam Pandey Death : ప్రముఖ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే కన్నుమూశారు. 32 ఏళ్ల ఆమె సర్వైకల్‌ క్యాన్సర్‌తో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా హ్యాండిల్​లో తన సన్నిహితులు పోస్ట్​ చేశారు. అయితే తొలుత దీన్ని నిజం కాదనుకున్న నెటిజన్లు, ఆ తర్వాత ఆ వార్త నిజమే అంటూ ఆమె పీఆర్ టీమ్ ధృవీకరించింది. దీంతో యావత్​ సినీ ఇండస్ట్రీ షాక్​కు గురైంది. ఆమె మృతి పట్ల పలుపురు ప్రముఖులు, ఫ్యాన్స్​ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

"ఈ ఉదయం చాలా దురదృష్టకరమైనది. మా ప్రియమైన పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో కోల్పోయాం. ఈ విషయం మీకు తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాం. ఆమెతో పరిచయం ఉన్న ప్రతీ వ్యక్తికి, జీవికి ఆమె స్వచ్ఛమైన ప్రేమ, దయ గురించి తెలిసే ఉంటుంది. ఇది చాలా బాధకరమైన సమయం. మమ్మల్ని కాస్త ఒంటరిగా వదిలేయాలని కోరుకుంటున్నాం" అంటూ ఆ పోస్ట్​లో పేర్కొన్నారు.

Poonam Pandey Career : ఇక పూనమ్​ కెరీర్​ విషయానికి వస్తే - ఓ మోడల్‌గా తన కెరీర్​ను ప్రారంభించిన పూనమ్‌ 2013లో విడుదలైన 'నషా' అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేశారు. దాని తర్వాత 'లవ్​ ఈజ్​ పాయిజన్​', 'అదాలత్​', 'ఆగయా హీరో', 'జీఎస్​టీ' (గల్తీ సిర్ఫ్​ తుమ్హారి), 'ద జర్నీ ఆఫ్ కర్మ' సినిమాల్లో మెరిశారు. అంతే కాకుండా మాలినీ అండ్ కంపెనీ అనే తెలుగు సినిమాలోనూ కనిపించారు. ఇలా పలు సినిమాల్లో నటించిన ఆమె, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్​ హోస్ట్‌గా వ్యవహరించిన 'లాకప్‌' అనే టెలివిజన్​ షో తొలి సీజన్‌లో పాల్గొన్నారు. దీంతో పాటు హిందీ ప్రముఖ షో 'ఖత్రోన్ కే ఖిలాడి'లోనూ కనిపించారు.

2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్‌ చాలా పాపులర్‌ అయ్యారు. అయితే ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

సినీ పరిశ్రమలో విషాదం- ప్రముఖ సీనియర్​ నటి కన్నుమూత

Actress Renjusha Menon Died : ప్రముఖ​ నటి అనుమానాస్పద మృతి.. కారణం అదేనా?

Last Updated : Feb 2, 2024, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.