ETV Bharat / entertainment

పదికి తొమ్మిది పాయింట్లు- IMDB టాప్ మూవీలు/సీరియల్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 10:29 AM IST

Updated : Feb 16, 2024, 11:48 AM IST

IMDB Top Rated Movies : ఏటా కొన్ని వందలు, వేల చిత్రాలు, టీవీ సీరియల్స్​ విడుదల​ అవుతుంటాయి. అందులో చాలా వరకు ఎప్పుడు రిలీజ్​ అయ్యాయో, ఎప్పుడు క్లోజ్​ అయ్యాయో కూడా తెలియదు. కానీ, కొన్ని సినిమాలు, ధారావాహికలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంటాయి. ఈ నేపథ్యంలో అలా చిరస్థాయిలో నిలిచిపోయిన చిత్రాలు, వెబ్​సిరీస్​లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

IMDB Top Rated Movies Serials Webseries And Shows
IMDB Top Rated Movies Serials Webseries And Shows

IMDB Top Rated Movies : థియేటర్లలో విడుదలయ్యే కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద, టీవీల్లో రిలీజయ్యే సీరియల్స్ స్మాల్​స్క్రీన్​పై కలెక్షన్స్​ పరంగా, ఆదరణ పరంగా రికార్డులు బ్రేక్​ చేసి సూపర్ హిట్​గా నిలుస్తుంటాయి. మరికొన్ని సినిమాలు, ధారావాహికలను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. జీవితాంతం వాటిని గుర్తుపెట్టుకుంటారు. అయితే అలా మంచి టాక్​ తెచ్చుకునే సినిమాలకు, వెబ్​సిరీస్​లకు, సీరియల్స్​కు, టీవీషోల​కు ప్రముఖ ఆన్​లైన్​ డేటాబేస్​ సంస్థ ఐఎండీబీ రేటింగ్​లు ఇస్తుంటుంది. అలా IMDB వద్ద మంచి రేటింగ్​ సాధించిన చిత్రాలు, షోలు, వెబ్​సిరీస్​లు, సీరియల్స్​ కొన్ని ఉన్నాయి. ఇవి ఐఎండీబీ ఇచ్చే హైయెస్ట్ రేటింగ్​ 10కి 9 రేటింగ్​ను దక్కించుకున్నాయి.

రామాయణ్​ సీరియల్​(1987-1988)
వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణ్​' ఒక హిందీ సీరియల్​. ఈ ధారావాహిక ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక సీరియల్​గా 'రామాయణ్​' రికార్డు సృష్టించింది. ఇది 1987లో డీడీ ఛానల్​లో ప్రసారమైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అహ నా పెళ్లంట(1987)
రాజేంద్రప్రసాద్​, రజనీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన 'అహ నా పెళ్లంట' తెలుగు సినిమా ఇప్పటికీ ఓ కామెడీ సెన్సేషన్. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన కామెడీ, డైలాగ్స్​ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఈ సినిమా టాలీవుడ్​ సినీ ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆషి హి బన్వా బన్వి(1988)
1966లో హృషికేశ్​ ముఖర్జీ తెరకెక్కించిన 'బీవీ ఔర్ మకాన్​' ఆధారంగా 'ఆషి హి బన్వా బన్వి' మరాఠీ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు, నటుడు సచిన్​ పిల్గాఓంకర్​ దీనిని రూపొందించారు. ఆయన తీసిన కల్ట్​ సినిమాలలో ఇదీ ఒకటి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సందేశం(1991)
భారతీయ గొప్ప చిత్రాల్లో మలయాళ భాషకు చెందిన 'సందేశం' సినిమా ఒకటి. సమకాలీన కేరళ రాజకీయాలను ఉద్దేశిస్తూ, సెటైర్లు వేస్తూ దర్శకుడు సత్యన్​ అంతికాడ్​ ఈ సినిమాను తెరకెక్కించారు. మూవీ పేరుకు తగ్గట్టే ఈ చిత్రం కేరళ ప్రజలకు రాజకీయాలపై మంచి సందేశాన్ని ఇచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహాభారతం(2013-14)
రూ.100 కోట్లతో తెరకెక్కించిన మొదటి ఇండియన్​ హిందీ సీరియల్ 'మహాభారతం'. 2013లో స్టార్​ ప్లస్​ ఛానల్​లో ప్రసారమైన ఈ సీరియల్​ను ఆడియెన్స్​ విశేషంగా ఆదరించారు. ఈ ధారావాహిక ఎపిసోడ్స్​ను చూసేందుకు ఇప్పటికీ ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యే మేరీ ఫ్యామిలీ(2018-2023)
వేసవికాల సమయంలో 1998లో జైపుర్​లో వచ్చిన ఓ వైరల్​ ఫీవర్​ ఆధారంగా 'యే మేరీ ఫ్యామిలీ' హిందీ టీవీ షోను తెరకెక్కించారు. 12 ఏళ్ల బాలుడి ఆరోగ్యం కోసం ఓ కుటుంబం పడే తపనను కథగా తీసుకొని దీనిని రూపొందించారు. ఇందులో మోనా సింగ్​ తల్లి పాత్రను పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జర్మనీకి ఐకాన్​ స్టార్ - ఆ సినిమా కోసం స్పెషల్ ట్రిప్!

లగ్జరీ హోటల్‌లో రకుల్ పెళ్లి - అక్కడ ఒక్క రూమ్ ధర ఎంతంటే ?

Last Updated : Feb 16, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.