ETV Bharat / entertainment

దేవరకొండను చూడగానే దిల్​ రాజు కొత్త కోడలు రియాక్షన్ వైరల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 12:46 PM IST

DilRaju Son Reception Vijaydevarkonda : దిల్ రాజు సోదరుడి కొడుకు, హీరో ఆశిశ్ రిసెస్షన్ గ్రాండ్​గా జరిగింది. ఇందులో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. కొత్త పెళ్లి కూతురు రౌడీ హీరోను చూడగానే ఎగ్జైటింగ్​ అయిన సందర్భం సోషల్ మీడియాలో మస్త్ ట్రెండ్ అవుతోంది.

Etv Bharat
దేవరకొండను చూడగానే దిల్​ రాజు కొత్త కోడలు రియాక్షన్ వైరల్​!

DilRaju Son Reception : ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కొడుకు, హీరో ఆశిశ్ పెళ్లి రీసెంట్​గా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న అద్విత అనే యువతితో ఘనంగా జైపుర్​​లోని ఓ ప్యాలెస్​లో జరిగింది. ఈ సందర్భంగా తాజాగా ఫిబ్రవరి 23న హైదరాబాద్​లోని ఓ కన్వెన్షన్ హాల్​లో ఆశిష్ – అద్వితల వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్​గా జరిగింది. ఈ వెడ్డింగ్ రెసెప్షన్​కు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సహా పలువురు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.

అయితే ఆశిశ్​ – అద్విత వెడ్డింగ్ రిసెప్షన్​కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. అయితే దీనికి సంబంధించిన వీడియోనే నెటిజన్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఎందుకంటే ఇందులో విజయ్ దేవరకొండను చూడగానే దిల్ రాజు కోడలు, పెళ్లికూతురు అద్విత చాలా ఎగ్జైట్​మెంట్​గా ఫీలైంది. తన ఫేవరేట్ హీరోను మొదటిసారి చూసినట్టుంది. అందుకే ఒక్కసారిగా చూడగానే ఎగ్జైటింగ్​గా ఫీలైయింది. వీడియోలో ఆశిశ్​ అద్వితను విజయ్ దేవరకొండకి పరిచయం చేయగా విజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయ్​ వారితో కలిసి ఫోటో దిగారు.

ప్రస్తతం ఈ వెడ్డింగ్ రిసెస్షన్​కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారాయి. విజయ్​ను చూడగానే అద్విత ఆశ్చర్యంతో, ఆనందంతో పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ బాగా హైలైట్ అయింది. దీనికి ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని క్యాప్షన్ జోడించి దిల్ రాజు కోడలు కూడా విజయ్ దేవరకొండ అభిమానే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ఇంకా ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో పాటు సీనియర్ హీరో నాగార్జున, నాగ చైతన్య, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, రామ్ పోతినేని, నితిన్, రష్మిక మందన్న, ఆర్ నారాయణ మూర్తి, బలగం టీమ్ త‌దిత‌రులు హాజరై నూతన వధూవరులను ఆశ్వీరద్వించారు. అలాగే శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ రిసెప్ష‌న్‌లో దిల్ రాజు సోంత ఊరు (నిజామాబాద్) ప్ర‌జ‌లు కూడా హాజరవ్వడం మరో విశేషం.

అతడితో ప్రేమలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి - ఫొటో షేర్ చేసిన ప్రియుడు!

చాలా రోజుల తర్వాత బికినీలో సమంత - నీటి కొలనులో జలకాలాడుతూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.