ETV Bharat / entertainment

అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్​ ఇదే - అసలు విషయం బయటపెట్టిన మేకప్​మెన్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 1:09 PM IST

Anushka Original Character : హీరోయిన్ అనుష్క ఒరిజనల్ క్యారెక్టర్​ గురించి ఓ వీడియో తెరపైకి వచ్చింది. అందులో ఓ ప్రముఖ మేకప్​మెన్​ అనుష్క అసలు వ్యక్తిత్వం గురించి షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ వివరాలు.

అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్​ ఇదే - అసలు విషయం బయటపెట్టిన మేకప్​మెన్​
అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్​ ఇదే - అసలు విషయం బయటపెట్టిన మేకప్​మెన్​

Anushka Original Character : హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లేడీ ఒరియెంటెడ్​ సినిమాలకు కేరాఫ్​ అడ్రెస్​. అయితే గత కొంత కాలంగా ఆమె సినిమాలను స్లోగా చేస్తోంది. రీసెంట్​గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం కొత్త చిత్రాలను ఒప్పుకొని చేస్తోంది.

ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే : అయితే అనుష్క ఒరిజనల్ క్యారెక్టర్​ గురించి చెప్పుకొచ్చారు మేకప్‌మెన్ బొమ్మదేవర రామచంద్రరావు. "ఆమె దర్శకుల, నిర్మాతల హీరోయిన్. తను చాలా సెన్సిటివ్‌ అమ్మాయి. ఎవరైనా వచ్చి సమస్య చెప్పుకుంటే తనకే ఆ సమస్య వచ్చినట్టుగా ఫీల్ల అవుతుంది,సహాయం చేస్తుంది. ఏదో మోహమాటంతో చేయడం కాదు, హార్ట్​తో చేస్తుంది. మంచి దయా గుణం ఆమెలో ఉంది. చాలా జెన్యూన్‌ పర్సన్‌. నాకు తెలిసీ ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టదు." అని అన్నారు.

మరో పదేళ్లైనా దొరకదు : "అనుష్క ఎంతో స్పెషల్‌. అలాంటి అమ్మాయి, హీరోయిన్​ మరో పదేళ్లలో కూడా ఇండస్ట్రీకి దొరకదు. ఆమె మంచితనాన్ని ఎవరూ మిస్ యూజ్ చేయలేరు. తాను ఒక మనిషిని చూడగానే అతని క్యారెక్టర్ ఏంటో కనిపెడుతుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. అందుకే ఆమెని ఎవరూ వేలెత్తి చూపలేరు. నాతో ఎప్పుడూ టచ్‌లోనే ఉండేది. మెసెజ్‌ చేయగానే రియాక్ట్ అయ్యేది. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది." అని చెప్పారు.

తక్కువ పారితోషికంతో : ఆమెతో గత సినిమాలకు పని చేసిన పరిచయంతో తాను నిర్మాతగా మారి పంచాక్షరి సినిమా చేసినట్లు గుర్తుచేసుకున్నారు మేకప్‌మెన్ బొమ్మదేవర రామచంద్రరావు. ఈ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమాకు అనుష్క తక్కువ పారితోషికం తీసుకుందని, కానీ లాభాలు వచ్చాక అనుష్క అడగకపోయినా తానే స్వయంగా మరికొంత ఇచ్చినట్టు చెప్పారు. కాగా, ఈ ఇంటర్వ్యూను కొంత కాలం క్రితం ఇచ్చారు రామచంద్రరావు. ఆ వీడియో ఇప్పుడు తెరపైకి మరోసారి వచ్చింది.

Anushka Krish Movie : అనుష్క ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శీలవతి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతుందని తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. వేదం చిత్రం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రమిది.

6 వేల సంవత్సరాల కథతో 'కల్కి' - టైటిల్ సీక్రెట్ ఇదే : నాగ్​ అశ్విన్

ఓటీటీలో హార్ట్ బీట్ పెంచే హారర్ మూవీస్​ - అక్కడ ఫ్రీగా చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.