టాటా కార్ లవర్స్​కు​ గుడ్ న్యూస్​ - ఈవీ​ మోడల్స్​ ధర​ ఏకంగా రూ.1.2 లక్షలు తగ్గింపు!

author img

By ETV Bharat Telugu Desk

Published : Feb 13, 2024, 5:29 PM IST

Updated : Feb 13, 2024, 5:36 PM IST

Tata Nexon ev Price cut

Tata Motors Cuts EV Car Price : టాటా కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. టాటా కంపెనీ తమ ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించింది. టాటా నెక్సాన్​ ఈవీపై రూ.1.2 లక్షలు, టాటా టియాగో ఈవీపై రూ.70వేలు వరకు తగ్గించింది. మిగతా కార్ల ధరలు ఎలా ఉన్నాయంటే?

Tata Motors Cuts EV Car Price : టాటా మోటార్స్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. టాటా కంపెనీ తన లేటెస్ట్ ఈవీ మోడల్స్ -​ నెక్సాన్​, టియాగో కార్ల ధరలను ఏకంగా రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాటరీ ధరలు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

  1. Tata Nexon.ev Price : టాటా కంపెనీ టాటా నెక్సాన్ ఈవీ కారు ధరను రూ.1.2 లక్షల వరకు తగ్గించింది. ఇకపై ఈ కారు ధర రూ.14.49 నుంచి ప్రారంభమవుతుంది.
  2. Tata Tiago.ev Price : టాటా కంపెనీ టియాగో ఈవీ కారు ధరను కూడా రూ.70,000 వరకు తగ్గించింది. కాబట్టి దీని బేస్ మోడల్​ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
  3. Tata Punch.ev Price : టాటా మోటార్ ఇటీవల లాంఛ్ చేసిన పంచ్​ ఈవీ ధరలను మాత్రం తగ్గించలేదు.

"ఎలక్ట్రిక్ కార్ల ధరలను బ్యాటరీలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గాయి. అందుకే ఈ బెనిఫిట్​ను నేరుగా కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం."
- వివేక్ శ్రీవాత్సవ, టాటా ప్యాసింజర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ చీఫ్​ కమర్షియల్ ఆఫీసర్​

ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు వివేక్ శ్రీవాత్సవ చెప్పారు. దేశీయంగా విద్యుత్‌ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని టాటా మోటార్స్‌ పేర్కొంది.

ఈవీ మార్కెట్​ పెరుగుతోంది!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు టాటా మోటార్స్​ దేశవ్యాప్తంగా తమ ఈవీ వెహికల్స్​ మార్కెట్​ను విస్తరించుకోవాలని ప్లాన్ చేసుకుంది.
2023లో ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్​లో 8 శాతం వృద్ధితో పోలిస్తే, ఈవీ సెగ్మెంట్ 90 శాతానికిపైగా వృద్ధి చెందింది. 2024లో కూడా ఇదే విధమైన గ్రోత్ ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ భావిస్తోంది. ఇండియన్​ ఈవీ మార్కెట్లో 70 శాతం వాటాతో టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

పర్సనల్ లోన్ కావాలా? ముందుగా ఈ 5 ప్రశ్నలు వేసుకోండి!

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలా? అయితే ఈ టాప్​-10 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

Last Updated :Feb 13, 2024, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.