ETV Bharat / business

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఫ్రీ ఫుడ్​ & స్లీపింగ్ రూమ్స్​ - వైరల్ వీడియో చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 1:41 PM IST

Microsoft Hyderabad Campus Viral Video : ఇటీవల మైక్రోసాఫ్ట్​ హైదరాబాద్ క్యాంపస్ ఉద్యోగులు విడుదల చేసిన ఇన్​స్టాగ్రామ్ రీల్​ (వీడియో) బాగా వైరల్ అయ్యింది. ఇందులో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగాలకు కల్పిస్తున్న అద్భుతమైన ఫెసిలిటీస్ గురించి చాలా చక్కగా చూపించారు. మరి అవేంటో మనమూ చూద్దామా?

Microsoft Perks for employees
Microsoft Hyderabad campus viral video

Microsoft Hyderabad Campus Viral Video : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ 'మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్' తమ ఉద్యోగులకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్​ కల్పిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మన దేశంలోని హైదరాబాద్ క్యాంపస్​లోనూ సూపర్ ఫెసిలిటీస్ అందిస్తోంది. వీటి గురించి వివరిస్తూ, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఓ ఇన్​స్టాగ్రామ్ రీల్​ (వీడియో)ను పోస్ట్ చేశారు. అది సూపర్ వైరల్ అయ్యింది.

ఇంతకీ ఆ 'రీల్​'లో ఏముంది?
మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 54 ఎకరాల హైదరాబాద్ క్యాంపస్​లో ఎనర్జీ-ఎఫీషియంట్ బిల్డింగ్స్ నిర్మించారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను, పటిష్టమైన హై-టెక్​ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటితోపాటు కార్యాలయంతో ఉద్యోగులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటన్నింటినీ చూపిస్తూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఒక ఇన్​స్టాగ్రామ్ రీల్ రిలీజ్ చేశారు. దానిలో ఏమున్నాయంటే?

Microsoft Facilities For Employees :

ఫ్రీ ఫుడ్ : మైక్రోసాఫ్ట్​ కంపెనీ తమ క్యాంపస్​లో 24x7 గంటలు కెఫెటీరియా (ఫలహారశాల)ను నడుపుతుంది. ఇందులో ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల స్నాక్స్​, డ్రింక్స్ ఉంటాయి. కాఫీ, టీ నుంచి లస్సీ, హెల్త్ డ్రింక్స్​ వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. హాట్ ఫిల్టర్ కాఫీ ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తుంది. ఇవన్నీ ఉద్యోగాలు కాస్త రీఛార్జ్ కావడానికి చాలా ఉపకరిస్తాయి. పైగా ఇవన్నీ పూర్తి ఉచితం.

మీటింగ్ ఏరియాస్​ : ప్రతి అంతస్తులోనూ ఉద్యోగులు పరస్పరం కలుసుకోవడానికి అనధికార సమావేశ ప్రాంతాలు ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడానికి, పునరుత్తేజం పొందడానికి ప్రత్యేకమైన గదులు కూడా ఉంటాయి.

జిమ్​ ఫెసిలిటీస్​ : మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం, వారి ఉత్పాదకతను పెంచడం కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తుంటుంది. అందులో భాగంగా క్యాంపస్​లోనే ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేసింది. ఇందులో ట్రైనర్స్ కూడా ఉంటారు. అలాగే ఇక్కడ ఫిట్​నెస్ క్లాసులు కూడా నిర్వహిస్తుంటారు.

హెల్త్ ఫెసిలిటీస్​ : అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించడం కోసం 24 గంటలూ అంబులెన్స్​లు రెడీగా ఉంటాయి. అలాగే ఫార్మసీ కూడా ఇక్కడే ఉంటుంది. కనుక ఔషధాల కోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు.

ఓపెన్ థియేటర్​ : క్యాంపెస్​ మీటింగ్​లు, ఈవెంట్​లు నిర్వహించడం కోసం మైక్రోసాఫ్ట్ క్యాంప్​స్​లోనే ఒక పెద్ద ఓపెన్ యాంఫీథియేటర్​ను నిర్మించారు.

ట్రాన్స్​పోర్ట్ ఫెసిలిటీస్​ : మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. ముఖ్యంగా వై-ఫై కనెక్టివిటీతో, ఫుల్ ఎయిర్​ కండిషన్డ్ బస్సులు నడుపుతోంది.

బ్యాంకింగ్ ఫెసిలిటీస్​ : మైక్రోసాఫ్ట్ క్యాంపస్​లో ప్రత్యేకంగా బ్యాంకింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. తక్షణం డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలను కూడా అక్కడే ఏర్పాటుచేశారు.

పూజ కోసం : భక్తులు దేవుని పూజించడం కోసం మైక్రోసాఫ్ట్ క్యాంపస్​లోనే ప్రత్యేకంగా ఒక మందిరం ఏర్పాటు చేశారు.

ఇవన్నీ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వీటన్నింటినీ కవర్ చేస్తూ, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు విడుదల చేసిన ఇన్​స్టాగ్రామ్ రీల్​కు భారీ స్పందన లభించింది. ఈ ఇన్​స్టాగ్రామ్ రీల్​కు కంపెనీ అధికారిక ఇన్​స్టాగ్రామ్ హ్యాండిల్​ 'మైక్రోసాఫ్ట్ లైఫ్' కూడా సపోర్ట్ చేసింది.

ప్రశంసల వర్షం
మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ఈ సౌకర్యాలు గురించి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సాధారణ ప్రజలు మాత్రమే కాదు, ఉద్యోగులు కూడా మైక్రోసాఫ్ట్​ కంపెనీని మెచ్చుకుంటున్నారు.

సత్య నాదెళ్ల బంపర్ ఆఫర్- 75 వేల మంది భారతీయ మహిళలకు ట్రైనింగ్

తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే జాబ్ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.