ఎల్​ఐసీ కరోడ్​ పతి స్కీమ్ - రూ.500 చొప్పున చెల్లిస్తే కోటి రూపాయలు చెల్లిస్తారు! - LIC Crorepati Life Benefits details

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 11:30 AM IST

LIC Crorepati Life Benefit Plan

LIC Crorepati Life Benefit Plan: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా ఓ నూతన పాలసీని ప్రవేశపెట్టింది. అదే ఎల్​ఐసీ కరోడ్​పతి లైఫ్​ బెనిఫిట్​ ప్లాన్​. ఇందులో 500 రూపాయలు పెట్టుబడి పెడితే కోటి రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

LIC Crorepati Life Benefit Plan: ప్రస్తుత కాలంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నందు వల్ల భవిష్యత్తులో ఆర్థిక అవసరాల కోసం ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. నెలవారీ జీతం పొందే వాళ్లైనా.. రోజు వారీ కూలీలైనా, వ్యాపారులైనా ఎవరైనా సరే పొదుపు పథకాల్లో చేరుతున్నారు. ఇక ప్రతి నెలా పెట్టుబడి పెడుతూ.. దీర్ఘ కాలంలో మంచి లాభాలు అందించే పథకాలు, స్కీమ్​లు, ప్లాన్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఇలాంటి పథకాలను అందుబాటులోకి తేవడంలో ముందు వరుసలో ఉంటుంది. తాజాగా.. ఓ స్కీమ్​ను ఎల్​ఐసీ అందుబాటులోకి తెచ్చింది. అదే ఎల్‌ఐసీ కరోడ్‌పతి లైఫ్ బెనిఫిట్‌ (LIC Crorepati Life Benefit). ఈ ప్లాన్​లో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందవచ్చు. ఈ పథకంలో చేరితే 1 కోటి రూపాయల వరకు తిరిగి పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

జీవిత బీమా తీసుకుంటున్నారా? క్లెయిమ్‌ సెటిల్‌మెంట్ రేషియో ఒకసారి చూసుకోవడం బెటర్!

పాలసీ వివరాలు చూస్తే.. ఎల్‌ఐసీ కరోడ్‌పతి లైఫ్ బెనిఫిట్‌ పాలసీలో మీరు రోజుకు 500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 16 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అంటే 16 సంవత్సరాలకు గానూ 30 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే.. ఆ తర్వాత కోటి రూపాయలను రాబడిగా పొందుతారు. ఎల్‌ఐసీ తెచ్చిన ఈ పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు.

అయితే.. మీరు 16 ఏళ్లు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ కోసం 9 సంవత్సరాల పాటు వేచి ఉండాలి. అలా మొత్తం 25 సంవత్సరాల తర్వాత మీరు కట్టిన 30 లక్షలకు 70 లక్షలు కలిపి కోటి రూపాయలను ఎల్​ఐసీ అందజేస్తుంది. ఈ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ మొత్తంతో పాటు, మీ కుటుంబానికి రూ. 40 లక్షల బీమా, రూ. 80 లక్షల వరకు ప్రమాద రక్షణ లభిస్తుంది. అనుకోని కారణాల వల్ల పాలసీదారు చనిపోతే.. అతడి కుటుంబానికి రూ. 80 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. కనుక మీరు తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు పొందాలంటే.. ఈ స్కీమ్ లో చేరడం మంచిది అంటున్నారు నిపుణులు.

40 ఏళ్లకే పెన్షన్​​ కావాలా? నెలకు రూ.12,500 ఇచ్చే బెస్ట్ పాలసీ ఇదే!

Note: పైన తెలిపిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వాణిజ్య రంగ నిపుణులు, ఏజెంట్ల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఈ ప్లాన్​లో పెట్టుబడి పెట్టేముందు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్​ చేయడం మంచిది.

ఎల్​ఐసీ నయా ప్లాన్​తో డబుల్ బెనిఫిట్స్​ - జీవిత బీమా + సంపద వృద్ధి!

గుడ్ న్యూస్​ - PF ఖాతాతో LIC పాలసీ లింక్​ చేయొచ్చు - లాభం ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.