ETV Bharat / business

మీ క్రెడిట్​ స్కోర్ రిపోర్ట్​లో తప్పులు ఉన్నాయా? సరిచేసుకోండి ఇలా! - How To Rectify Cibil Errors

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 6:13 PM IST

How To Rectify Cibil Errors : బ్యాంకులు లేదా రుణ సంస్థలు లోన్ మంజూరు చేసేముందు కచ్చితంగా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్​ స్కోర్​ను పరిశీలిస్తాయి. ఆ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతోనే రుణం మంజూరు చేస్తాయి. అయితే కొన్ని సార్లు మన స్కోరు నివేదికలో తప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం.

How To Rectify Cibil Errors
How To Rectify Cibil Errors

How To Rectify Cibil Errors : రుణం తీసుకోవాలంటే బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్‌ సోర్కునే. ఇందులో ఎలాంటి తప్పులు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ నివేదికలో పొరపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని వెంటనే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నివేదికలో సాధారణంగా వచ్చే తప్పులు, వాటిని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం.

  • నివేదికలో కొన్నిసార్లు మన పేరు, చిరునామా, పుట్టిన రోజు, పాన్‌ వివరాలు ఇలాంటివి తప్పుగా వస్తుంటాయి.
  • ఇప్పటికే ఉన్న రుణాలకు సంబంధించిన సమాచారం నివేదికలో కనిపిస్తుంది. ఈ రుణాల సంఖ్య లేదా మొత్తం అధికంగా ఉన్నప్పుడు ఎక్కడో పొరపాటు దొర్లిందని అర్థం.
  • రుణ వాయిదాల చెల్లింపులో ఎప్పుడైనా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఎన్ని రోజులు ఆలస్యంగా చెల్లించారనే విషయాన్ని కూడా నివేదికలో పేర్కొంటారు. కొన్నిసార్లు సమయానికే చెల్లిస్తున్నా ఆలస్యమైనట్లు పేర్కొనవచ్చు.
  • మనకు ఏమాత్రం సంబంధం లేని రుణాలు ఈ నివేదికలో కనిపించే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటప్పుడు మన రుణ అర్హత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి క్రెడిట్‌ నివేదికను జాగ్రత్తగా పరిశీలించాలి. ఏమాత్రం అనుమానాలున్నా వెంటనే సంబంధిత పొరపాటును సరి చేయాల్సిందిగా కోరుతూ సిబిల్‌ను సంప్రదించాలి.
  • సిబిల్​కు రిపోర్టు చేసే ముందుగా నివేదికను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. మీ రుణ ఖాతా వివరాలను పోల్చి చూసుకోవాలి. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే బ్యాంకును సంప్రదించి, వాటిని సరిచేయాల్సిందిగా కోరండి. చాలా సందర్భాల్లో బ్యాంకు నుంచి సమాచారం వెళ్లగానే నివేదికలో సరైన వివరాలు కనిపిస్తాయి. సిబిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో మీ వివరాలతో లాగిన్‌ కావడం ద్వారా పొరపాట్లను నమోదు చేయొచ్చు.
  • ఒకవేళ నివేదికలో ఉన్న వివరాలు అర్థం కాకపోతే మీ బ్యాంకు శాఖను సంప్రదించి, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
  • సిబిల్‌ నివేదికలో ప్రతి ఖాతాదారుడికీ ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. పొరపాట్లను నమోదు చేసేటప్పుడు దీన్ని తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. మీ నుంచి వచ్చిన వివరాలను క్రెడిట్‌ బ్యూరో సంబంధిత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు పంపించి, ధ్రువీకరించుకుంటుంది. ఆ తర్వాతే మార్పులు చేస్తుంది.
  • పొరపాట్లను సరిచేసేందుకు 30-45 రోజుల వరకు సమయం పడుతుంది.
  • రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేకున్నా, కనీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్‌ నివేదికను తనిఖీ చేసుకోవడం మంచిది. అలా చేయటం అసలు మర్చిపోవద్దు. అప్పుడే ఎలాంటి తప్పులకూ రాకుండా ఉంటాయి.

జొమాటోకు బిగ్​ షాక్​ - పన్ను, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని ఐటీ నోటీస్​! - Zomato Gets Rs184 Cr IT Notice

SIP చేస్తున్నారా? 7-5-3-1 నియమం పాటిస్తే భారీ లాభాలు గ్యారెంటీ! - Mutual Fund Investment Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.