ETV Bharat / business

గుడ్​ న్యూస్​ - తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 9:29 AM IST

Updated : Feb 27, 2024, 10:29 AM IST

Gold Price Today February 27th 2024
Gold Rate Today February 27th 2024

Gold Rate Today February 27th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today February 27th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,496 ఉండగా, మంగళవారం నాటికి రూ.348 తగ్గి రూ.64,148కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.71,672 ఉండగా, మంగళవారం నాటికి రూ.188 తగ్గి రూ.71,484కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 27th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.
  • Gold Price In Vijayawada February 27th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 27th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.
  • Gold Price In Proddatur February 27th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 27th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2032 డాలర్లు ఉండగా, మంగళవారం కూడా 2032 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.57 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 27th 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.46,58,217
ఇథీరియంరూ.2,66,690
టెథర్రూ.82.67
బైనాన్స్ కాయిన్రూ.30,910
సొలోనారూ.9,201

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 27th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 22 పాయింట్లు నష్టపోయి 72,767 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 9 పాయింట్లు కోల్పోయి 22,113 వద్ద కొనసాగుతోంది

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టీసీఎస్​, విప్రో, హెచ్​సీఎల్ టెక్​, టైటాన్​, టాటా మోటార్స్​, మారుతి సుజుకి, పవర్​గ్రిడ్​, ఇన్ఫోసిస్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : యాక్సిస్ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్​, ఏసియన్ పెయింట్స్​

రూపాయి విలువ
Rupee Open February 27th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.88గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 27th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices February 27th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.12 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.43 డాలర్లుగా ఉంది.

ఉద్యోగుల కోసం అదిరిపోయే స్కీమ్ - ఎఫ్​డీ కంటే అధిక వడ్డీ + ట్యాక్స్ బెనిఫిట్స్​ కూడా!

మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలా? ఈ టాప్​-9 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

Last Updated :Feb 27, 2024, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.