ETV Bharat / business

మీ కారు కోసం కొత్త టైర్లు కొంటున్నారా? ఈ టిప్స్ పక్కాగా పాటించండి! - Buying Car Tyres Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 11:48 AM IST

Buying Car Tyres Tips : ప్రస్తుత కాలంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. కుటుంబ సభ్యులతో ప్రయాణించాలంటే బైక్ మీద కుదరదు. అందుకే చాలా మంది కార్లను విక్రయిస్తున్నారు. కొత్త కారైనా సరే కొన్నాళ్లకు టైర్ మార్చాల్సిందే. అయితే కారు టైరు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Buying Car Tyres Tips
Buying Car Tyres Tips

Buying Car Tyres Tips : కారు మంచి కండీషన్​లో ఉండాలంటే అన్ని భాగాలు కర్టెక్​గా ఉండాలి. కారు కండీషన్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే కారుకు వినియోగించే స్క్రూ నుంచి టైర్ల వరకు అన్ని ముఖ్యమే. మనిషికి కాళ్లు ఎలాగో వాహనాలకు టైర్లు అలాగే. సరైన నాణ్యత లేని టైర్లు వాడడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడతారు. నాణ్యత లేని టైరు కొంటే అది మాటిమాటికి ప్యాచ్ అయిపోవడం, పేలడం జరగొచ్చు. అలాంటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.

టైర్ జీవితకాలం, వాతావరణం, రోడ్లు, డ్రైవింగ్ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. మీ టైర్ అరిగిపోయిందని భావించినప్పుడు రీప్లేస్‌మెంట్ కోసం షోరూమ్​కు వెళ్లినప్పుడు మీ కారు టైర్ సైజు చూసుకోవాలి. సాధారణంగా టైర్ సైజ్ దాని సైడ్‌వాల్‌పై ఉంటుంది. కాబట్టి మీరు కొత్త టైర్లను కొనుగోలు చేసేటప్పుడు పాతటైరు సైజును చెక్ చేసుకోవడం ముఖ్యం.

తరచూ చెక్​ చేసుకోవాలి
కొత్త టైరు కొనుగోలు చేసేటప్పుడు దానిపై ముద్రించిన తయారీ తేదీని తనిఖీ చేయండి. ఎక్స్పైరీ డేట్ జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే కారు టైర్లు రబ్బరుతో తయారవుతాయి. ఇవి కాలక్రమేణా పాడవుతుంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే వాతావరణ పరిస్థితులు వేడిగా ఉంటాయి. అందువల్ల టైర్‌ను కొనుగోలు చేసేటప్పుడు తయారీ తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. టైర్లను క్రమం తప్పకుండా వాహనదారులు చెక్ చేసుకోవాలి. అవి అరగగానే వెంటనే కొత్తది వేసుకోవడం ఉత్తమం. మెకానిక్ దగ్గరకు వెళ్లి కొత్త టైర్ మార్చుకోవాలా అని అడిగినా అతడే సలహా ఇస్తాడు.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే!
కారులో రివర్స్ గేర్​కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మరి ఈ గేరును తరచూ వాడం మంచిదేనా? అనే ప్రశ్నకు డ్రైవింగ్‌లో చాలా అనుభవం ఉన్నవారు సైతం బలంగా "అవును" అని చెప్పలేరని అంటారు. మరి నిజంగా ఏం జరుగుతుంది? రివర్స్ డ్రైవింగ్ కారుకు మంచిదా? కాదా??

రివర్స్ గేరులో కారును నడిపిస్తున్నప్పుడు చాలా స్లోగా వెనక్కి కదులుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఫస్ట్ గేర్​తో సమానం. ఫస్ట్ గేర్​లో కారు ముందుకు చాలా తక్కువ వేగంతోనే వెళ్తుంది. రివర్స్ గేర్‌లో కూడా ఇదేవిధంగా తక్కువ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. మరి ఈ గేర్ ఎక్కువగా వినియోగిస్తే కారు ఇంజిన్​కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని ప్రశ్నిస్తే, నేరుగా దానిపై పెద్దగా ప్రభావం ఏమీ పడదని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇతర సమస్యలు తలెత్తి, అవి పరోక్షంగా ఇంజిన్​పై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు.

కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే! - Old Vs New Tax Regime for TDS

మంచి టూ-వీలర్​ కొనాలా? రూ.1లక్ష బడ్జెట్లోని టాప్​-10 బైక్స్ ఇవే! - Best Bikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.