ETV Bharat / business

అంబానీ ఇంట పెళ్లి సందడి- అనంత్ ప్రీ వెడ్డింగ్​కు గెస్ట్​ల లిస్ట్​ ఇదే- ఏర్పాట్లు వేరే లెవెల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 5:21 PM IST

Anant Ambani Pre Wedding Celebration : అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌కు వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. జుకర్‌బర్గ్‌, బిల్‌గేట్స్‌ వంటి వారు తరలిరానున్నారు. అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Anant Ambani Pre Wedding Celebration
Anant Ambani Pre Wedding Celebration

Anant Ambani Pre Wedding Celebration : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్​ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్​ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు అంబానీ ఫ్యామిలీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అట్టహాసంగా జరగనున్నాయి. మార్చి 1-3 తేదీల మధ్య జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ కాంప్లెక్స్‌లో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

బిలీయనర్ల నుంచి స్టార్ల వరకు!
జామ్​నగర్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ ప్రముఖులు అంతా తరలిరానున్నారు. బిలియనీర్ల దగ్గర నుంచి బాలీవుడ్ హీరోల వరకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు అందరూ అంబానీ వారింట పెళ్లి సందడిలో పాల్గొంటారు. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌ సహా తదితరులు హాజరుకానున్నారు.

భూటాన్‌ రాజు, రాణి కూడా!
వీరితో పాటు బ్లాక్‌రాక్‌ సీఈఓ ల్యారీ పింక్‌, బ్లాక్‌స్టోన్‌ ఛైర్మన్‌ స్టీఫెన్‌ స్క్వార్జ్‌మ్యాన్‌, డిస్నీ సీఈఓ బాబ్‌ ఐగర్‌, ఇవాంకా ట్రంప్‌, ఖతార్‌ ప్రధాని మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌థాని విచ్చేయనున్నారు. మోర్గాన్‌ స్టాన్లీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, బెర్క్‌షైర్‌ హాథ్‌వే వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు కెనడా, స్వీడన్‌, ఆస్ట్రేలియా, బొలీవియా దేశాల మాజీ ప్రధానులు, భూటాన్‌ రాజు, రాణి తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

భారతీయ సంస్కృతిని పరిచయం చేసేలా!
అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్​కు వచ్చే విశిష్ట అతిథులను సాదరంగా స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని లాల్‌పుర్, కచ్‌లో మహిళలు తయారు చేసిన కండువాలను సిద్ధం చేశారు. అలాగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు పరిచయం చేయాలని అంబానీ ఫ్యామిలీ ఆలోచిస్తోందట.

ఎలాంటి ఇబ్బందులు కలగకుండా!
అయితే ఆ మూడు రోజుల్లో అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంబయి, దిల్లీ నుంచి జామ్​నగర్​కు అతిథులు ప్రయాణించే ఛార్టెడ్​ విమానాలకు సంబంధించిన పూర్తి విషయాలను త్వరలోనే అందించనున్నారట. హెయిర్ స్టైలింగ్, చీర డ్రాపింగ్, మేకప్​న​కు ఏర్పాట్లు చేశారట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అతిథులకు సేవలు అందించనున్నారట.

ఇటీవలే లగన్​ లఖ్​వనూ!
ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, మరో ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమర్తె రాధికా మర్చంట్ నిశ్చితార్థం గతేడాది జనవరిలో జరిగింది. ముంబయిలోని ఆంటిల్లాలో సంప్రదాయ పద్ధతిలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. నిశ్చితార్థంలో కాబోయే వధూవరులిద్దరూ అప్పుడు సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. ఇటీవలే లగన్‌ లఖ్‌వనూ వేడుక కూడా నిర్వహించాయి అంబానీ, మర్చంట్ కుటుంబాలు. త్వరలోనే అనంత్, రాధిక వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

కుమారుడి ఎంగేజ్​మెంట్​లో అంబానీ దంపతుల జోర్దార్ డ్యాన్స్​

అంబానీ ఇంట పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారల సందడి.. సల్మాన్​-ఐశ్వర్యతో పాటు ఇంకెవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.