ETV Bharat / business

"అమెజాన్​ బజార్"​ - ఇచట అన్ని వస్తువులూ డెడ్​ చీప్​గా లభించును! - Amazon Bazaar

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 1:42 PM IST

Amazon Bazaar: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ "సరికొత్త బిజినెస్" ప్రారంభించింది. 'అమెజాన్ బజార్' పేరిట కొత్త విభాగాన్ని లాంచ్ చేసింది. మరి ఏంటీ బజార్​? దీని ప్రత్యేకత ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Amazon Bazaar
Amazon Bazaar

Amazon Bazaar: ప్రస్తుత రోజుల్లో ఆన్​లైన్​ షాపింగ్​ వినియోగం భారీగా పెరిగింది. బయట షాపులకు వెళ్లి షాపింగ్​ చేసేంత టైం, ఓపిక లేకపోవడంతో జనాలందరూ వీటిపైనే ఆధారపడుతున్నారు. 10 రూపాయల వస్తువు నుంచి లక్షల్లో ఖరీదు చేసే వస్తువుల వరకు ఆన్​లైన్​లోనే కొనేస్తున్నారు. అలాగే కిరాణా సామాను మొదలుకొని అన్ని వస్తువులనూ ఇంటివద్దకే డెలివరీ చేస్తుండటంతో వీటికి డిమాండ్​ బాగా పెరిగింది.

పైగా సాధారణ మార్కెట్​తో పోలిస్తే.. ఇక్కడ పలు ఆఫర్స్ అందుబాటులో ఉండటంతో జనం బాగా ఆకర్షితులవుతున్నారు. దీంతో ఆన్​లైన్​ దుకాణాలన్నీ కస్టమర్లకు ఆఫర్స్​ మీద ఆఫర్స్​ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తమ కస్టమర్లను పెంచుకునేందుకు సరికొత్త వ్యాపారానికి తెరలేపింది. అన్ బ్రాండెడ్, తక్కువ ధర కలిగిన ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వస్తువులను సేల్ చేయడానికి "అమెజాన్ బజార్(Amazon Bazaar)" అనే విభాగాన్ని తీసుకొచ్చింది.

ఓటీటీ లవర్స్ స్పెషల్ - అమెజాన్ ప్రైమ్​​ అదిరిపోయే ప్లాన్స్​ - 30 డేస్​ ఫ్రీ ట్రయల్​ కూడా! - Amazon Prime Subscription Plans

600 రూపాయల లోపు..

ఈ బజార్​లో రూ.600 లోపు విలువ కలిగిన వస్తువులు ఉంటాయి. అమెజాన్​ సైట్​లో అన్ని రకాల ధరల్లో వస్తువులు అందుబాటులో ఉంటాయని మనకు తెలిసిందే. కానీ.. ఈ బజార్​లో మాత్రం 600 లోపు విలువైనవి మాత్రమే ఉంటాయి. చెప్పులు, దుస్తులు, డెకరేటివ్ ఐటమ్స్, బెడ్ రూమ్, కిచెన్ వస్తువులు, డోర్ కర్టన్స్, హ్యాండ్ బాగ్స్, లగేజ్​ బ్యాగ్స్​, మెన్స్​, ఉమెన్స్​, పిల్లలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులూ, వస్త్రాలూ ఈ అమెజాన్ బజార్​లో లభిస్తాయి.

అంతేకాకుండా ఇందులో ఏ వస్తువు కొన్నా 4 నుంచి 5 రోజుల్లో డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దేశంలోని పలు మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ద్వారా సెల్లర్లు తమ ఉత్పత్తులను ఈ బజార్​లో సేల్ చేసుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ రూపొందించినట్లు అమెజాన్ తెలిపింది. దీనికిగానూ సెల్లర్స్ నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయడం లేదని తెలిపింది. ప్రస్తుతం ఈ అమెజాన్ బజార్​లో బోలెడన్ని వస్తువులు అమ్మకానికి ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి విజిట్ చేసి మీకు నచ్చినవి ఆర్డర్​ చేసుకోండి.

ఈ బజార్​లో షాపింగ్​ చేయడానికి ఎటువంటి స్పెషల్ రిస్కూ​ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న అమెజాన్ యాప్, వెబ్​సైట్​లోనే అమెజాన్ బజార్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్​ చేస్తే.. అమెజాన్ బజార్ ఓపెన్ అవుతుంది. దీనికి ప్రత్యేకంగా యాప్​ ఏమీ లేదు.

  • ముందుగా గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి అమెజాన్​ యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకోవాలి.
  • తర్వాత యాప్​కి లాగిన్​ అయిన తర్వాత హోమ్​ పేజీలో Bazaar అనే ఆప్షన్​ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్​ చేస్తే Bazaar కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది.
  • అందులో మీకు నచ్చిన వాటిని షాపింగ్​ చేసి కొనుగోలు చేయవచ్చు..

ఏఐతో షాపింగ్ మరింత ఈజీ- కొత్త టూల్​ను లాంఛ్​ చేసిన అమెజాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.