'టైమ్‌ 100' జాబితాలో అజయ్ బంగా, ఆలియాభట్‌, సత్య నాదెళ్ల- వరల్డ్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్ వీరే! - TIME 100 Most Influential 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 8:49 AM IST

Updated : Apr 18, 2024, 10:43 AM IST

TIME 100 Most Influential 2024

TIME 100 Most Influential 2024 : ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ ​ బుధవారం విడుదల చేసింది. అందులో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, భారత మహిళ రెజర్ల సాక్షి మాలిక్ స్థానం సంపాదించుకున్నారు.

TIME 100 Most Influential 2024 : ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, నటుడు, డైరెక్టర్‌ దేవ్‌ పటేల్‌ టైమ్స్‌ మ్యాగజైన్​ '100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024' లిస్టులో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమై 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసింది.

ఈ జాబితాలో అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్‌ జిగర్‌ షా, యేల్‌ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతికశాస్త్రాల ప్రొఫెసర్‌ ప్రియంవదా నటరాజన్‌ ఉన్నారు. వారితో పాటు భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్‌, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

అజయ్​బంగా ఆ పనిని చేసి చూపించారు
అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్‌ యెలెన్‌ అజయ్‌బంగా ప్రొఫైల్‌ రాశారు. 'ఓ కీలక సంస్థను పరివర్తనం చెందించే అత్యంత ముఖ్యమైన పనిని చేపట్టేందుకు నైపుణ్యం, ఉత్సుకత ఉన్న నాయకుడిని గుర్తించడం సులభమేమీ కాదు. కానీ, గత జూన్‌లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అయిన తర్వాత అజయ్‌బంగా ఆ పనిని చేసి చూపించారు' అని అందులో కొనియాడారు. బాలీవుడ్ నటీ ఆలియాభట్​పై హాలీవుడ్​ దర్శకుడు టామ్ హార్పర్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈయన మ్యాగజైన్‌కు అలియా గురించి రాస్తూ, ప్రపంచంలోనే ప్రముఖ నటుల్లో ఒకరు మాత్రమే కాదు, దశాబ్దానికి పైగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చేసిన పనిని మెచ్చుకున్నారు. అలియా ట్రూలీ ఇంటర్నేషనల్‌ స్టార్‌ అని పేర్కొన్నారు. 2023లో ఆలియా 'హార్ట్ ఆఫ్ స్టోన్‌' హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పెట్టింది. ఈ మూవీ డైరెక్టర్‌ టామ్‌ హార్పరే.

భవిష్యత్తును తీర్చిదిద్డంలో
సత్య నాదెళ్లను ప్రస్తావిస్తూ 'ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తీవ్ర ప్రభావం చూపుతున్నారు. మానవాళికి అది మంచి విషయం కూడా' అని టైమ్‌ మేగజీన్‌ పేర్కొంది. ఇక సాక్షి మాలిక్​కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పోరాటానికి గాను ఈ గౌరవం లభించింది. మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిలిచి నిరసనలు వ్యక్తం చేశారు.

లోక్​సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెర- తమిళనాడుపై ఫుల్​ ఫోకస్​! - Lok Sabha Election 2024

ఓటింగ్ టైంలో EVM పనిచేయకుంటే ఏం జరుగుతుంది? ఓటరు తప్పు బటన్‌ను నొక్కితే ఏం చేయాలంటే? - LOK SABHA ELECTION 2024

Last Updated :Apr 18, 2024, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.