ETV Bharat / bharat

ప్రభుత్వ స్కూల్​లో స్విమ్మింగ్ పూల్, హైటెక్ క్లాస్ రూమ్స్​- ప్రైవేట్ పాఠశాల విద్యార్థులంతా అక్కడికే జంప్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 10:52 AM IST

Updated : Feb 29, 2024, 11:37 AM IST

Swimming Pool In Government School : గవర్న్​మెంట్​ స్కూల్​లో స్విమ్మింగ్ పూల్​ ఏంటని అనుకుంటున్నారా? స్విమ్మింగ్ పూల్ మాత్రమే కాదు, 22 హైటెక్నాలజీ తరగతి గదులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ చదివేందుకు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా పోటీపడుతున్నారు. ఇంతకీ ఈ స్కూల్ ఎక్కడుందంటే?

Punjab School Of Eminence
Punjab School Of Eminence
  • పాఠశాల ఆవరణలో స్విమ్మింగ్ పూల్
  • హైటెక్నాలజీతో 22 తరగతి గదులు
  • ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్ట్స్
  • విద్యార్థులకు స్పెషల్ ప్లే గ్రౌండ్

ఈ సదుపాయాలన్నీ చూస్తే అవన్నీ ఓ ఫేమస్ ప్రైవేట్ స్కూల్​లో ఉన్నాయనుకుంటున్నారా​? కానే కాదు. ఈ అత్యాధునిక సౌకర్యాలన్నీ ఓ గవర్నమెంట్​ స్కూల్​లోనే ఉన్నాయి. మూడు ఎకరాల్లో నిర్మించిన ఈ పాఠశాల త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే అడ్మిషన్లను స్వీకరిస్తుండగా, అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లను సైతం తలదన్నేలా ఉన్న ఈ పాఠశాల​ పంజాబ్​లోని లుధియానాలో ఉంది.

Swimming Pool In Government School
పంజాబ్​ సర్కార్ నిర్మించిన పాఠశాల భవంతి

స్విమ్మింగ్​ పూల్​తోపాటు అత్యాధునిక సౌకర్యాలతో పంజాబ్ ప్రభుత్వం ఈ పాఠశాలను లుధియానాలోని ఇంద్రపురిలో నిర్మించింది. 22 స్మార్ట్ తరగతి గదులతోపాటు విద్యార్థులకు సరిపడా టాయిలెట్ల నిర్మాణం కూడా చేపట్టింది. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్​తోపాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. గతంలో ఇలాంటి స్కూల్​ను అమృత్​సర్​లో ప్రారంభించింది మాన్ సర్కార్.

స్కూల్​ అంతా సీసీటీవీ కెమెరాలు!
Swimming Pool In Government School : విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు స్కూల్ ఆఫ్ ఎమినెన్స్​ పేరిట ఈ పాఠశాలను మూడు ఎకరాల్లో నిర్మించారు. విద్యార్థుల భద్రత కోసం స్కూల్​ అంతా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. నాలుగు సైన్స్ ల్యాబ్​లతోపాటు ప్రత్యేకమైన కంప్యూటర్ ల్యాబ్​ను నిర్మించారు. 2024-25 విద్యా సంవతర్సానికి గాను అడ్మిషన్లను ప్రస్తుతం స్వీకరిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంద్రపురిలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1341 మంది విద్యార్థులను ఇక్కడికి తరలించనున్నారు.

Swimming Pool In Government School
పంజాబ్ ప్రభుత్వం నిర్మించిన పాఠశాల

అడ్మిషన్లకు గట్టిపోటీ
ఇక ఈ పాఠశాలలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రభుత్వ పాఠశాల ఎక్కడా చూడలేదని చెబుతున్నారు. ఇలాంటి సౌకర్యాలను కేవలం ప్రైవేట్ పాఠశాల్లో చూశామని, కానీ ప్రభుత్వ పాఠశాల్లో చూడలేదని అంటున్నారు. మరోవైపు, విద్యార్థులు కూడా తమ ప్రాంతంలో ఇలాంటి స్కూల్​ను ప్రభుత్వం నిర్మించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.

Swimming Pool In Government School
గవర్నమెంట్​ స్కూల్​లో స్విమ్మింగ్ పూల్

ప్రభుత్వం నిరంతర కృషి
లూధియానాలోని ఇంద్రపురిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారి జస్వీందర్ సింగ్ తెలిపారు. పాఠశాలలో ప్లేగ్రౌండ్‌తో పాటు స్విమ్మింగ్‌ పూల్‌ సౌకర్యం కూడా ఉందని, పంజాబ్‌లోనే ఇలాంటి తొలి ప్రభుత్వ పాఠశాల ఇదేనని చెప్పారు. రాష్ట్రమంతా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

Swimming Pool In Government School
బాస్కెట్​ బాల్ కోర్ట్

సెలవులే లేని బడి- 365 రోజులు, నిత్యం 14 గంటలు క్లాసులు- పిల్లలకు సూపర్​ ఫన్​, ఇన్​కమ్​!

స్టూడెంట్స్​ ఫిట్​నెస్​ కోసం ప్రిన్సిపల్​ 'ఎగ్​ ఛాలెంజ్'​- రోజూ 6కి.మీ రన్నింగ్​ చేస్తే గిఫ్ట్​లుగా గుడ్లు!

Last Updated : Feb 29, 2024, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.