ETV Bharat / bharat

ఒకేసారి 1.33 కోట్లమంది సూర్య నమస్కారాలు- వరల్డ్ రికార్డ్ దాసోహం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 10:33 AM IST

Rajasthan Surya Namaskar : కోటి మందికి పైగా ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాజస్థాన్​లోని 88 వేల స్కూళ్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోటి 14 లక్షల మంది విద్యార్థులు పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు.

rajasthan-surya-namaskar-world-record
rajasthan-surya-namaskar-world-record

ఒకేసారి 1.33 కోట్ల మంది సూర్య నమస్కారాలు

Rajasthan Surya Namaskar : రాజస్థాన్​లో ఒకేసారి కోటి మందికి పైగా సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని 88 వేల పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో 1.14 కోట్ల మంది విద్యార్థులు సహా 1.33 కోట్ల మంది పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి నవీన్ జైన్ తెలిపారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. 88,974 పాఠశాలలకు చెందిన కోటి 14 లక్షల 69 వేల 914 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. విద్యార్థులతో కలిపి మొత్తంగా కోటి 33 లక్షల 50 వేల 889 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమయ్యారని చెప్పారు.

rajasthan-surya-namaskar-world-record
సూర్య నమస్కారాలు చేస్తున్న విద్యార్థులు, అధికారులు
rajasthan-surya-namaskar-world-record
సూర్య నమస్కారాల కార్యక్రమంలో విద్యార్థులు

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
రథసప్తమి నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ మంది పాల్గొని సూర్య నమస్కారాలు చేసిన కార్యక్రమంగా దీనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు లభించింది. ఈ మేరకు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రథమ్ భల్లా రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్​కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యా శాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

rajasthan-surya-namaskar-world-record
సూర్య నమస్కారాల కార్యక్రమంలో విద్యార్థులు
rajasthan-surya-namaskar-world-record
సూర్య నమస్కారాల కార్యక్రమంలో విద్యార్థులు

గుజరాత్​లో గిన్నిస్ రికార్డు
కాగా, ఇటీవల గుజరాత్​లోనూ ఇదే తరహాలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. దానికి గిన్నిస్ రికార్డుల్లో చోటు లభించింది. మోఢేరాలోని సూర్య దేవాలయం సహా 108 ప్రదేశాల్లో వేలాది మంది సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. కొత్త సంవత్సరం పురస్కరించుకొని గుజరాత్ రాష్ట్ర యోగా బోర్డు జనవరి 1న ఈ కార్యక్రమం నిర్వహించింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, హోంమంత్రి హర్ష్‌ సంఘ్వీ సైతం ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. పూర్తి వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ఒకేసారి 108 చోట్ల సూర్య నమస్కారాలు- న్యూఇయర్ రోజున గుజరాత్ గిన్నిస్ రికార్డ్

హెడ్​ కానిస్టేబుల్ సస్పెన్షన్​- మణిపుర్​లో మళ్లీ హింస- ఇంటర్నెట్ బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.