ETV Bharat / bharat

మీల్​ మేకర్​ మంచూరియా - ఇలా చేస్తే టేస్ట్​ అదిరిపోద్ది! పిల్లలు అస్సలు వదిలిపెట్టరు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 5:33 PM IST

Meal Maker Manchurian: సాయంత్రమైతే చాలు చాలా మందికి ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. కొద్దిమంది ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో లభించే మంచూరియాలను ఇష్టంగా తింటుంటారు. అయితే అలా బయట కొనకుండా ఇంట్లోనే ఒకసారి మీల్ మేకర్‌తో మంచూరియా చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

Meal Maker Manchurian
Meal Maker Manchurian

Meal Maker Manchurian Making Process: మంచూరియా.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి తినాలనిపిస్తుంది. వెజ్​ మంచూరియా, చికెన్​ మంచూరియా అంటూ బయట ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లో లభించే వాటిని కొనుక్కోని తింటుంటారు. అయితే ఎప్పుడూ అవే కాకుండా ఇంట్లోనే ఒక్కసారి మీల్​ మేకర్​తో మంచూరియా ట్రై చేస్తే టేస్ట్​ అదిరిపోతుంది. మార్కెట్లో సోయా చంక్ పేరుతో మీల్ మేకర్ లభిస్తుంది. ఇక ఈ మీల్​మేకర్​ను బిర్యానీ, పలావుల్లో వేసి వండుతారు. వీటిని కూరగా కూడా వండుకుంటారు. ఈసారి మీరు మీల్ మేకర్ మంచూరియా రెసిపీ ట్రై చేయండి. టేస్ట్​ కూడా అదిరిపోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావలసిన పదార్థాలు

  • మీల్ మేకర్ - ఒక కప్పు
  • ఉల్లిపాయల తరుగు - రెండు స్పూన్లు
  • పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
  • కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
  • అల్లం తరుగు - ఒక స్పూను
  • వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
  • గ్రీన్ చిల్లి సాస్ - ఒక స్పూను
  • సోయా సాస్ - అర స్పూను
  • టమాటా కెచప్ - ఒక స్పూను
  • వెనిగర్ - అర స్పూను
  • నీళ్లు - తగినన్ని
  • మిరియాల పొడి - అర స్పూను
  • స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - ఒక స్పూను
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ మీద గిన్నె పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి.
  • నీళ్లు వేడెక్కాక మీల్​మేకర్​ను వేసి స్టవ్ ఆఫ్​ చేసి ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • తర్వాత వాటిని చేత్తో తీసి పిండి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఆ గిన్నెలోనే రుచికి సరిపడా ఉప్పు, కార్న్​ఫ్లోర్ కూడా వేసి కలపాలి. ఈ మీల్ మేకర్ మొత్తానికి కార్న్ ఫ్లోర్, ఉప్పు పట్టేలా చూడండి.
  • ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
  • నూనె వేడెక్కాక మీల్​ మేకర్​లను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత స్టవ్ మీద మరో కళాయి పెట్టి.. మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి కళాయిలో మూడు స్పూన్ల నూనె వేయాలి.
  • నూనె వేడెక్కాక పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లులి తరుగు వేసి వేయించాలి.
  • ఇప్పుడు మంటను సిమ్​లో పెట్టి చిల్లీ సాస్, సోయాసాస్, టమాటా కెచప్, వెనిగర్ వేసి వేయించాలి.
  • మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. కాస్త ఉప్పు కూడా చల్లుకోవాలి.
  • అది గ్రేవీలా ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్‌లను అందులో వేసి బాగా కలుపుకోండి.
  • పైన స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవాలి. అంతే మీల్ మేకర్​ మంచూరియా రెడీ.
  • ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు.

ఉపయోగాలు: మీల్ మేకర్ తినడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. సోయాతో చేసిన ఈ మీల్ మేకర్‌ను తినడం వల్ల మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఎన్నో రకాల క్యాన్సర్లు రాకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే ఈ మీల్ మేకర్లో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది.

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.