ETV Bharat / bharat

కొత్త పరుపు కొనుగోలు చేస్తున్నారా? - ఈ విషయాలు మరిచిపోవద్దు! - Tips To Choose Good Mattress

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 10:42 AM IST

Good Mattress Choose Tips : సాధారణంగా మనకు మార్కెట్​లో రకరకాల పరుపులు దొరుకుతుంటాయి. అయితే, వాటిలో చాలా మందికి సరైన మ్యాట్రెస్ ఎలా ఎంచుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారు మేము చెప్పబోయే ఈ టిప్స్ పాటించారంటే హై క్వాలిటీ మ్యాట్రెస్​ను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Tips To Choose Good Mattress
Mattress

Best Tips To Choose Good Mattress : ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో డబుల్ కాట్ మంచాలు ఉన్నాయి. ఇక వాటిపై కొందరు మామూలు పరుపులు యూజ్ చేస్తుంటే, ఇంకొందరు బ్రాండెడ్​వి వాడుతుంటారు. నిజానికి నాణ్యమైన పరుపు ఉంటే మంచి పోశ్చర్​లో హ్యాపీగా ఎక్కువసేపు నిద్రపోతామని అందరికీ తెలిసిన విషయమే. కానీ, చాలా మంది సరైన పరుపును(Mattress) ఎంచుకోవడంలో విఫలమవుతుంటారు. దీంతో నాణ్యమైన పరుపు తీసుకోలేదని, డబ్బులు వృథా అయ్యాయని బాధపడుతుంటారు. అలాకాకుండా మీరు పరుపు కొనేటప్పుడు మేము చెప్పబోయే టిప్స్ పాటించారంటే మంచి పరుపు మీ సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పరుపు రకం : మీరు సరైన పరుపును ఎంచుకోవడంలో మ్యాట్రెస్ టైప్ కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. మార్కెట్​లో అందుబాటులో ఉండే వివిధ రకాల పరుపులు వివిధ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇన్నర్​స్ప్రింగ్స్, మెమరీ ఫోమ్, లాటెక్స్, హైబ్రిడ్.. ఇలా అనేక రకాలుగా ఉంటాయి పరుపులు. వాటిల్లో మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నిద్రను, చర్మానికి మృదువుగా ఉండే అధిక నాణ్యత గల పరుపును కొనుగోలు చేయడం ఎల్లప్పుడూ మంచిది అంటున్నారు నిపుణులు.

సైజ్ : మంచి నాణ్యత గల పరుపును కొనాలనుకున్నప్పుడు మీరు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం.. దాని సైజ్. ఎందుకంటే మీరు కొన్న పరుపు డబుల్ కాట్ మంచానికి సరిగ్గా సెట్ కాకపోతే.. సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల అది త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే కంఫర్ట్​గా నిద్రపోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, మీ మంచానికి సైజ్​ను బట్టి మ్యాట్రెస్ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి అంటున్నారు.

మందం : మందంగా ఉన్న పరుపు శరీరానికి మంచి సపోర్ట్ ఇవ్వడంతో పాటు వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడంలో ఎంతో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు తీసుకునే మ్యాట్రెస్ కావాల్సినంత మందంగా ఉంటే అది మీకు మరింత సౌకర్యవంతంగా మారుతుందని చెబుతున్నారు. అలాకాకుండా, మీరు తీసుకున్న పరుపు ఎక్కువ మందంగా ఉన్నా లేదా మరి సన్నగా ఉన్నా దానిపై పడుకోవడం నిద్రకు భంగం కలిగించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

అర్థరాత్రి మేలుకుంటున్నారా? మళ్లీ నిద్రపట్టడం లేదా? ఈ '7' టిప్స్ పాటించి చూడండి!

దృఢత్వం : మంచి నాణ్యమైన పరుపును సొంతం చేసుకోవాలంటే మీరు కొనేటప్పుడు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం.. మాట్రెస్ దృఢత్వం. ముఖ్యంగా మీరు కొనే పరుపు మృదువుగా, గట్టిగా లేదా మధ్యస్థంగా ఉందో లేదో చెక్ చేయాలి. మృదువైన పరుపులు నిద్రలో మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే మంచి పోశ్చర్​లో నిద్రపోవడానికి సహాయపడడమే కాకుండా వెన్నునొప్పి నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయంటున్నారు నిపుణులు.

కంఫర్ట్‌ : ఇక చివరగా మీరు అధిక నాణ్యత గల పరుపును తీసుకోవాలంటే చూడాల్సిన మరో అంశం.. మ్యాట్రెస్ కంఫర్ట్. ఇది మీరు మంచి నిద్రను పొందడంలో సౌకర్యంగా ఉండడమే కాకుండా సరైన పరుపును ఎంచుకోవడంలో కీలకంగా మారుతుంది. అంతేకాకుండా, సరైన పొశ్చర్​లో సుఖమైన నిద్రను పొందడంలో సహాయపడడమే కాకుండా నిద్ర నాణ్యతను పెంచుతుందని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి మీరు కనుక పరుపు కొనుగోలు చేసేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారంటే గుడ్ క్వాలిటీ మ్యాట్రెస్ మీ సొంతమవుతుందని చెబుతున్నారు!

60 సెకన్లలో గాఢ నిద్ర - చంటి పాపలా పడుకుంటారంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.