ETV Bharat / bharat

ముద్దులొలికే చిన్నారులకు ముద్దు పెడుతున్నారా? - వారి ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 12:57 PM IST

Don't Kiss Newborns : చాలా మందికి చిన్నపిల్లలను అందులో నవజాత శిశువులను చూడగానే ముద్దు పెట్టాలనిపిస్తుంది. కొన్నిసార్లు ముందు వెనుకా ఆలోచించకుండా వారి చిట్టి చిట్టి బుగ్గలపై కిస్ చేస్తుంటారు. కానీ, అలా చిన్నపిల్లలకు ముద్దు పెట్టడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.

Kiss
Newborns

Health Risks of Kissing New Born Baby : చిన్నపిల్లలను చూస్తే వచ్చే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. వారి అమాయకమైన నవ్వు, చూపులు లోకాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలు మన చేతికి వస్తే చాలు వారిని ముద్దు చేయకుండా అస్సలు ఉండలేము. అయితే ఇలా చేయడం నవజాత శిశువు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిడ్డ సరైన ఎదుగుదలకు తల్లిదండ్రులు, సంరక్షకుల ఆప్యాయత అవసరమైనప్పటికీ చిన్నారుల ముఖం లేదా పెదవులపై ముద్దు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని, లేదంటే వారి ఆరోగ్యాన్ని మీరే ఇబ్బందుల్లోకి నెట్టినవారవుతారంటున్నారు. అసలు నవజాత శిశువు(New Born Baby)కు ముద్దు ఎందుకు పెట్టకూడదు? దాని వల్ల కలిగే నష్టాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముద్దు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముద్దు పెట్టడం వల్ల కలిగే నష్టాలేంటంటే? : నవజాత శిశువుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు లేదా ఇంకెవరైనా బిడ్డ పెదవులు/ముఖంపై ముద్దుపెట్టినప్పుడు ఫ్లూ, కొవిడ్-19, ఇతర శ్వాసకోశ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే నవజాత శిశువుల శ్వాసకోశ వ్యవస్థ అంత బలంగా ఉండదు. వారి ఊపిరితిత్తులు పూర్తిగా పరిపక్వం చెందడానికి 8 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రత్యేకించి మీ బిడ్డకు పూర్తిగా టీకాలు వేయకపోతే మీరు ముద్దు పెట్టినప్పుడు మీ లాలాజలం హెపటైటిస్ బి ని ప్రసారం చేయవచ్చు. అయితే ఇతర శరీర భాగాలపై ముద్దు పెట్టుకోవడం సురక్షితమైనది అయినప్పటికీ, కొన్నిసార్లు హెర్పెస్ వైరస్ శిశువులకు హానికరం కావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

పేరెంట్స్ కూడా బిడ్డను ముద్దు పెట్టుకోకూడదా?

మీరు(పేరెంట్స్) జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడకపోతే పెదాలపై కాకుండా నుదిటిపై లేదా బుగ్గల మీద ముద్దు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు యాక్టివ్ హెర్పెస్ ఇన్ఫెక్షన్ ఉంటే పిలల్ల దగ్గరకు పోకపోవడం మంచిది. అదే విధంగా తప్పనిసరిగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వారు అనారోగ్యం బారిన పడకుండా రక్షించడానికి షెడ్యూల్ ప్రకారం మీ బిడ్డకు టీకాలు వేయించడం చాలా ముఖ్యం.

అలాగే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు లిప్‌స్టిక్ లేదా ఏదైనా క్రీమ్ పెట్టుకున్నప్పుడు అందులో ఉండే రసాయనాలు శిశువు చర్మంపై దద్దుర్లు రావడానికి కారణం కావొచ్చు. అలాంటి టైమ్​లో బిడ్డకు ముద్దు పెట్టకుండా ఉండటం సురక్షితం.

బిడ్డ పుట్టగానే చేయాల్సిన పనులివే!.. ఆరోగ్యమైన శిశువు కోసం చిట్కాలు..

నవజాత శిశువు అనారోగ్యం బారిన పడకుండా పెద్దలు పాటించాల్సిన జాగ్రత్తలు :

  • నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
  • పిల్లలను పట్టుకునేముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. బంధువులకు కూడా ఇది వర్తిస్తుంది.
  • ప్రసవం తర్వాత చాలా మంది పిల్లలను చూడటానికి వస్తుంటారు. ఈ క్రమంలో వచ్చినవారికి, శిశువుల మధ్య సురక్షితమైన దూరం ఉండేలా చూడడం చాలా అవసరం. ముఖ్యంగా వారిలో ఎవరికైనా అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండమని చెప్పడానికి అస్సలు ఆలోచించకండి.
  • శిశువుకు శ్వాసలో ఇబ్బంది, దగ్గు, సరిగా పాలు తాగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
  • ఇక చివరగా పేరెంట్స్ అనారోగ్యంగా ఉన్నా శిశువులకు సురక్షితమైన దూరం పాటించండి. అలాగే వారి పెదవులపై ముద్దు పెట్టుకోవడం మానుకోవాలని గుర్తుంచుకోండి.

మీకు పుట్టబోయే బిడ్డ రూపాన్ని - ఈ 6 అంశాలు నిర్ణయిస్తాయని మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.