అన్నం మిగిలిపోయిందా? - చీజ్​ రైస్​ కట్​లెట్​ చేసేయండి - అద్దిరిపోద్దంతే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 1:39 PM IST

Cheese Rice Cutlet Recipe Making Process

Cheese Rice Cutlet Recipe: రాత్రి వండిన అన్నం మిగిలిపోవడం కామన్​. అయితే.. దాన్ని ఉదయం తినమంటే మాకొద్దు చద్దన్నం అంటుంటారు చాలా మంది. ఇక మిగిలిన అన్నాన్ని పోపు వేస్తారు మరికొందరు. అయితే ఎప్పుడూ అదే కాకుండా ఈ సారి కొత్తగా.. చద్దన్నంతో కట్​లెట్​ చేసేయండి. టేస్ట్ అద్దిరిపోద్దంతే..

Cheese Rice Cutlet Recipe Making Process: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అందుకే.. అన్నాన్ని పడేయవద్దని చెబుతుంటారు. అయితే.. కొన్ని కారణాల వల్ల చాలా ఇళ్లలో రాత్రి పూట అన్నం మిగిలిపోతూ ఉంటుంది. పొద్దున ఆ అన్నం పెడితే.. చద్దన్నం మాకొద్దంటారు పిల్లలు. అన్నం పడేయాలంటే మనసుకు బాధ కలుగుతుంది. కొంత మంది పోపు చేస్తుంటారు. కానీ.. నిత్యం అదే అయితే తినడానికి ఇంట్రస్ట్​ చూపించరు.

అందుకే.. మిగిలిపోయిన అన్నంతో కొన్ని రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో చీజ్ రైస్ కట్లెట్ ఒకటి. ఇది పిల్లలకు చాలా నచ్చుతుంది. టమాట కెచప్, పుదీనా చట్నీ, మయోనెస్ వంటి వాటితో కలిపి వీటిని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా.. సాయంత్రం పూట స్నాక్స్​గా ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

చీజ్​ రైస్​ కట్​లెట్​కు కావాల్సిన పదార్థాలు :

 • అన్నం - 1 కప్పు
 • ఉడికించిన మొక్కజొన్న గింజలు - అర కప్పు
 • ఉప్మా రవ్వ - 2 టేబుల్​ స్పూన్లు (దోరగా వేయించుకోవాలి)
 • పసుపు - పావు టీ స్పూన్​
 • ఆయిల్​ - 2 టేబుల్​స్పూన్లు
 • ఉల్లిగడ్డ - 1
 • పచ్చిమిర్చి తరుగు - 1 టీస్పూన్​
 • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీస్పూన్​
 • కారం - అర టీ స్పూన్​
 • ధనియాల పొడి - అర టీ స్పూన్​
 • చీజ్​ - 100 గ్రాములు(తురుముకోవాలి)
 • ఉప్పు - తగినంత

తయారీ విధానం:

 • ముందుగా స్టవ్​ మీద పాన్​ పెట్టి 1 టేబుల్​స్పూన్​ నూనె వెయ్యాలి.
 • నూనె వేడెక్కాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తరుగు వేసి ఓ నిమిషం పాటు వేయించుకోవాలి.
 • తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.
 • తర్వాత అందులోకి ఉడికించి మెత్తగా చేసుకున్న మొక్కజొన్న గింజలను వేసుకోవాలి.
 • ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి కొన్ని నిమిషాలు ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి.
 • ఇప్పుడు ఓ బౌల్​లోకి అన్నం తీసుకోవాలి. అందులోకే ఉప్మా రవ్వ, మొక్కజొన్న గింజల మిశ్రమం, తురుమిన చీజ్​ వేసుకుని మెత్తగా కలుపుకోవాలి.
 • తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కట్లెట్​లుగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం చేసి పక్కన పెట్టుకోవాలి.
 • ఇప్పుడు స్టవ్​ మీద ఫ్రై పాన్​ పెట్టి 1 టేబుల్​ స్పూన్​ నూనె వేసి వేడి చేయాలి. తర్వాత రెడీ చేసుకున్న కట్లెట్​లను పెట్టి రెండు వైపులా గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు కాల్చుకోవాలి. మధ్యమధ్యలో కట్​లెట్లకు నూనె అప్లై చేసుకోవాలి.
 • అంతే ఎంతో టేస్టీగా ఉండే చీజ్​ రైస్​ కట్లెట్​ రెడీ. వీటిని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయి.

చద్దన్నం మాకొద్దు అంటున్నారా? - ఇలా ఎగ్​ పులావ్ చేయండి ఎగబడి తింటారు!

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.