Ammireku Waterfall: అమ్మిరేకు జలపాతం హొయలు.. పర్యటకులు ఫుల్ చిల్!
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా మన్యంలో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. రాజవొమ్మంగి మండలం అమ్మిరేకు జలపాతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మైదాన పట్టణ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్ద ఎత్తున జలపాతం వద్దకు తరలి వస్తున్నారు.