విద్యా వ్యవస్థలో అయోమయం.. పాఠశాలలు మూసివేయబోమంటూనే విలీనం!
వేసవి సెలవులకు ముందువరకు ఉన్న బడి.. ఇప్పుడు మాయమైపోయింది. పాఠశాల తరలిపోయిందని ఉపాధ్యాయులు చెప్పడంతో విస్తుపోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల వంతు అవుతోంది. ఎవరు ఏ బడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, నూతన విద్యా విధానమంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో విద్యావ్యవస్థలో నెలకొన్న అయోమయం ఇది. పాఠశాలలను మూసివేయబోమంటూనే విలీనం చేసేస్తున్నారు. ఊరిలోని బడి మరోచోటకు తరలించేయడమంటే.. మూసివేతకాక మరేమిటి? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలు తెరచుకున్న తొలిరోజునే బడులు విలీనమా? విహీనమా? అంటూ దీనిపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..