ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ZPTC Member Tears in Front of YCP Minister: 'నీళ్లురాని కుళాయికి మంత్రి ప్రారంభోత్సవం'.. 'కంట తడి పెట్టిన జడ్పీటీసీ సభ్యురాలు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 12:30 PM IST

zptc_member_tears

ZPTC Member Tears in Front of YCP Minister:వైసీపీ మంత్రి ఎదుట అదే పార్టీకి చెందిన మహిళా జడ్పీటీసీ సభ్యురాలు కన్నీరు పెట్టుకున్న ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలోని మొగళ్లమూరు గ్రామంలో చోటుచేసుకుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించగా వీటిలో స్థానిక శాసనసభ్యుడైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వారిలో అమలాపురం పట్టణానికి చెందిన ఒక వైసీపీ నాయకుడు అల్లవరం జడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమిని ఏక వచనంతో.. 'పక్కకు ఉండు' అనడంతో ఆమె మనస్తాపానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో తోటి మహిళా ప్రజాప్రతినిధులు ఆమెను ఓదార్చారు.

తాగునీరు రాని మంచినీటి పథకానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శాసనసభ్యుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ఘటన పలు విమర్శలకు దారి తీసింది. అమలాపురం ఎంపీ చింత అనురాధ నివాసం ఉండే మొగళ్లమూరు గ్రామంలో మంచినీటి పథకానికి మంత్రి విశ్వరూప్ ప్రారంభోత్సవం. చేశారు దీనికి సంబంధించి కుళాయి నుంచి చుక్క నీరు కూడా రాలేదు. దీంతో అధికారులపై ఆయన ఆగ్రహించారు. కార్యక్రమం అనంతరం మంత్రి రెబ్బనపల్లి గ్రామానికి వెళ్లగా... తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని మహిళలు నిలదీశారు. ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నా మంచినీళ్లు రావటం లేదని స్థానికులు మంత్రి ఎదుట ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details