ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేటు పెంచాలని పాలు పారబోసి మహిళా రైతుల నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 8:30 PM IST

Women_Dairy_Farmers_Protest_In_YSR_District

Women Dairy Farmers Protest In YSR District: కేంద్ర, రాష్ట్ర అనాలోచిత నిర్ణయాల వల్ల పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని మహిళా రైతులు నిరసనకు దిగారు. గేదె పాలకు లీటర్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. తమ ఆవు పాల ఉత్పత్తులను వివిధ డెయిరీ కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కూడలి, RDO కార్యాలయం ఎదుట నిరసనగా పాలను పారబోసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలో పాలను ఉత్పత్తి చేస్తున్న మహిళలు ఆందోళన చేపట్టారు. మోరగుడి, పెద్ద పసుపుల, వేమ గుంటపల్లె, సున్నపురాళ్లపల్లె, సుగుమంచిపల్లె, దేవగుడి తదితర గ్రామాల నుంచి సుమారు 100 మంది మహిళ పాడి పరిశ్రమ రైతులు నిరసనకు దిగారు. తమ పాల ఉత్పత్తులను అమూల్, సంఘం, దొడ్ల, అమృత డెయిరీలు  కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటరు పాలు రూ.80కి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం RDO కార్యాలయంలో పరిపాలన అధికారి అక్బల్ బాషాకు వినతిపత్రం అందజేశారు. 

ABOUT THE AUTHOR

...view details