ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Wildlife Sientist Inspecting The Tirumala Footpath : శ్రీవారి మెట్టు, అలిపిరి కాలిబాటలను పరిశీలించిన కేంద్ర వన్యప్రాణుల శాస్త్రవేత్తలు బృందం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 2:05 PM IST

Wildlife_ Sientist_ Inspecting_ The Tirumala_ Footpath

Wildlife Sientist Inspecting The Tirumala Footpath: శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్జప్తి మేరకు అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటలో కేంద్ర వన్యప్రాణుల శాస్త్రవేత్తలు (Wildlife scientists) పర్యటించారు. ఈ మేరకు వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా బృందం రెండు రోజుల పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటలను పరిశీలించారు. అలిపిరి కాలిబాటలో చిరుతల నుంచి భక్తులను రక్షించడానికి కంచె ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఈ తనిఖీలు చేస్తున్నామని వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ తెలిపారు. చిన్నారి లక్షిత పై చిరుత దాడి అనంతరం భక్తుల భద్రతపై ఆందోళనలు తలెత్తడంతో భద్రత చర్యలపై సమగ్ర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వన్య ప్రాణుల ఆవాసాల కేంద్రాలు, కదలికలను సంరక్షిస్తూ భక్తుల భద్రత కూడా ముఖ్యమన్నారు. కాలిబాటలో కంచె, అండర్ పాస్, పుత్ బ్రిడ్జి ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. కాలిబాట మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు అయితే క్షణక్షణం భయం భయంగా ఉంటున్నారు. ఎటు వైపు నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details