ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రోడ్డు కబ్జా - స్థానికులు ఇక్కట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 1:33 PM IST

Volunteer_Occupied_Road_in_Anantapur

Volunteer Occupied Road in Anantapur: వాలంటీర్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం (Tahasildar Office) ఎదుట గోవిందరావు, శశిధర్‌ అనే వ్యక్తులు బైఠాయించి ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా విడపనకల్లు స్థానిక ఓసీ (oc) కాలనీలో ప్రభుత్వ రహదారిని వాలంటీర్‌ (volunteer) ఆమర్నాథ్‌ కబ్జా చేసాడు. ఈ స్థలంలో పశువుల కోసం షెడ్డు (shed)ను నిర్మించుకున్నాడు. వాలంటీర్ స్థలం ఆక్రమణపై అధికారులకు దాదాపు 8 నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి షెడ్​ను తొలగించి ఇంతకు ముందు పరిస్థితి కల్పించాలని ఫిర్యాదుదారుడు గోవిందరావు డిమాండ్ చేశారు. 

Protest for Justice Infront of Tahasildhar Office: రోడ్డుకు అడ్డంగా వాలంటీరు షెడ్డు నిర్మించటంతో వర్షపు నీటి పారుదలకు, రహదారిపై రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్​సీపీ నేతల సహకారంతో వాలంటీర్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించకుంటే నిరాహార దీక్షకు దిగుతామని గోవిందరావు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details