ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వృద్ధురాలి అనుమానాస్పద మృతి - ఆస్తి కోసమే అంతమొందించారా?!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 4:54 PM IST

unknown_person_killed_women

Unknown Persons Killed the Old Woman : నంద్యాల జిల్లాలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. స్థానిక ఎన్జీవో కాలనీ సమీపంలో హౌసింగ్​ బోర్డులో ఒంటరిగా నివాసం ఉంటున్న గ్లాడిస్​ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ రోజు ఉదయం పని మనిషి వచ్చి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. గ్లాడిస్​ను ఎంత పిలిచినా పలకపోవడం వల్ల ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇంటి తాళాన్ని పగల గొట్టి ఇంట్లోకి వెళ్లి చూస్తే బెడ్​ రూమ్​లో గ్లాడిస్ మృత దేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Police Have Registered a Case : నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో గ్లాడిస్​, సుధాకర్​ అనే దంపతులు కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. సుధాకర్ దూరదర్శన్​లో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తూ నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. వారికి ఇద్దరు కుమారైలు. గత ఏడాది సుధాకర్​ రావు మృతి చెందడం వల్ల అప్పటి నుంచి ఒంటరిగానే నివసిస్తోంది. ఇప్పుడు గ్లాడిస్​ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆమె ఆస్తి, డబ్బు కోసం హత్య చేసి ఉంటారా, లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details