ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏడాదికో డీఎస్సీ అన్నారు - ఐదేళ్లలో ఒక్కటీ లేదని మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన నిరుద్యోగులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 8:41 PM IST

unemployees_protest_on_mega_dsc

Unemployees Protest on Mega DSC :  రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని నిరుద్యోగులు మట్టడించారు. బొత్స ఇంటి వద్దకు భారీగా చేరుకున్న నిరుద్యోగులు, మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన నిర్వహించారు. బొత్స ఇటీవలే డీఎస్సీ ప్రకటన అంటూ వ్యాఖ్యానించినా, ఇంకా నోటిఫికేషన్​ విడుదల చేయలేదని నిరుద్యోగులు మండిపడ్డారు.

మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరుతూ నిరుద్యోగులు విజయనగరంలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. అంతకుముందు స్థానికంగా ఉన్న కోట కూడలి నుంచి మంత్రి ఇంటి వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పైడి తల్లి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకోగానే, సీఎం మనస్సును మార్చాలని పైడితల్లిని ప్రార్థించారు. నిరుద్యోగులు మంత్రి ఇంటిని ముట్టడించిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో, అక్కడున్న సిబ్బందికి వినతిపత్రాన్ని అందించారు. మేనిఫేస్టోని భగవద్గీత, ఖురాన్​, బైబిల్​ అని ప్రకటించిన సీఎం, అందులోని హామీలను విస్మరించడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది డీఎస్సీ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details