ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Protest: విద్యాశాఖాధికారులను సస్పెండ్ చేయడంపై.. ఉపాధ్యాయుల నిరసన

By

Published : Apr 22, 2023, 5:16 PM IST

ఉపాధ్యాయుల నిరసన

Teachers Protest: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కేజీబీవీని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా నలుగురు విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేశారు. దీంతో ఈ చర్యను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.  శనివారం పార్వతీపురం, వీరఘట్టంలో.. ప్రవీణ్ ప్రకాష్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట తమ నిరసనను తెలియజేసి.. అనంతరం అంబేడ్కర్​కి తమ నిరసన ప్రతిని చదివి వినిపించారు. 

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీగా విధులను నిర్వర్తిస్తున్నా సరే.. ఏవేవో కారణాలు చూపించి ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు కూడా.. తమపై వేస్తున్నారుని నిరసన వ్యక్తం చేశారు. 8వ తరగతి బాలికలకు గణితం పుస్తకాలు అందుబాటులో లేవని నెపం చూపించి డీఈవో, ఎంఈవో,  జీసీడీవో, కేజీబీవీ ప్రిన్సిపల్​ను అక్రమంగా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. 

ABOUT THE AUTHOR

...view details