ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP State President Achennaidu Fire: 'టోల్​ప్లాజాలో పట్టుబడ్డ కొకైన్ వెనుక తాడేపల్లి ప్యాలెస్, సజ్జల'

By

Published : Aug 18, 2023, 2:04 PM IST

TDP State President Achennaidu Fire

TDP State President Achennaidu Fire on The State Government: వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ పట్టుబడ్డా ఇప్పటివరకు బయటకు రాకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. కొకైన్, గంజాయి ( ganja ) మాఫియా వెనుక తాడేపల్లి ప్యాలెస్, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని ఆరోపించారు. కొకైన్ తరలిస్తూ పట్టుబడిన ఐదుగురు నిందితులు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులే అని అచ్చెన్నాయుడు తెలిపారు. కొకైన్ ముఠా వెనుక ఎవరున్నారో గుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గంజాయి, డ్రగ్స్ మాఫియాతో యువతను నిర్వీర్యం చేస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుందని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి... రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని, ప్రజలను మోసం చేస్తూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రానికి జగన్ శనిలా దాపురించారు: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details